అతి నిద్ర ..ఆరోగ్యానికి ప్రమాదం !

Update: 2020-01-09 01:30 GMT
కొంతమంది రోజులో ఎక్కువ భాగం నిద్రపోవడానికి సమయాన్ని కేటాయిస్తుంటారు. నిద్ర మంచిదే. మంచిది కదా అని బద్దకంగా పది, పన్నెండు గంటల పాటు నిద్రపోతే అసలుకే ఎసరు వస్తుంది. అవసరమైన దానికంటే ఎక్కువ నిద్రపోయేవారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. మెడికల్ జర్నల్ న్యూరాలజీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, మధ్యాహ్నం 90 నిమిషాల కంటే ఎక్కువసేపు క్రమం తప్పకుండా నిద్రపోయే వ్యక్తులు 30 నిమిషాల వరకు న్యాప్స్ తీసుకున్న వ్యక్తులతో పోలిస్తే, వారికి 25 శాతం ఎక్కువగా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది అని వెల్లడించింది

అలాగే శరీరంలో కొవ్వు పెరిగిపోయి స్థూలకాయం బారిన పడవలసి వస్తుంది. అతిగా నిద్ర పోవడం వల్ల తలనొప్పితో మొదలై నాడీ వ్యవస్థ మొత్తం ప్రభావితం అవుతుంది. ఒళ్లునొప్పులు ఉన్నప్పుడు ఎక్కువసేపు నిద్రపోతే నొప్పులు తగ్గుతాయనుకుంటాం. కాని అతినిద్ర వల్ల నడుమునొప్పి ఎక్కువై ఇబ్బందిపడాల్సి రావొచ్చు. ఎక్కువసేపు నిద్రపోతే మెదడు చురుకుదనం తగ్గుతుంది. మతిమరుపు త్వరగా వచ్చేస్తుంది. నిద్రలో కంఫర్టబుల్ పొజిషన్ లో పడుకోకపోతే కండరాలు ఒత్తిడికి లోనై వెన్నునొప్పి జీవితాంతం వేధించేందుకు ఆస్కారం కూడా ఉంది.

తాజాగా చైనాలో  750 మందిపై ఓ పరిశోధన జరిగింది. ఈ పరిశోధన ప్రారంభించినపుడు.. అందులో పాల్గొన్న ప్రజలకు ఎటువంటి గుండె జబ్బులు లేవు. ఆరు సంవత్సరాల పరిశోధనల తరువాత.. రాత్రి ఏడు లేదా అంతకంటే తక్కువ గంటలు పడుకున్న వ్యక్తులతో పోల్చితే, రాత్రి తొమ్మిది గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు పడుకున్నవారికి స్ట్రోక్ వచ్చే అవకాశం 23 శాతం ఎక్కువగా ఉంది అని  తేలింది. సో టైం ఉంది కదా అని ఎక్కువసేపు నిద్రపోతే గుండెకి చాలా ప్రమాదం..కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందుకే నిద్రపోయేముందు టైమ్ పెట్టుకుని రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోతే ఆరోగ్యంగా జీవించవచ్చు.


Tags:    

Similar News