తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు హాజరైన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదాకు ఎంపీ కవిత మద్దతివ్వడంపై పవన్ స్పందిస్తూ.. హోదాకు మద్దతు తెలిపిన కవితకు ధన్యవాదాలు తెలిపారు. కలిసి పనిచేస్తే ఇరు రాష్ర్టాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. రెండు రాష్ర్టాలకు ప్రత్యేక హోదా అవసరమేనన్నారు. కలిసి ఉంటే నిలబడతాం.. విడిపోతే పడిపోతామని పేర్కొన్నారు. ఈ మేరకు అమెరికాలో పర్యటిస్తున్న పవన్ ప్రత్యేక ట్వీట్ చేశారు.
కాగా, అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంటు సదస్సులో నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుకవిత కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని అమ్మ వారికి పూజలుచేసి సారె సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ర్టాలు విడిపోయినా తెలుగు ప్రజలంతా ఒక్కటేని, ప్రత్యేకహోదా సాధనకు తాము కూడా మద్దతునిస్తామని చెప్పారు. సినీనటుడు పవన్ కల్యాణ్ హోదాకోసం జల్లికట్టు తరహాలో ఉద్యమించాలని పిలుపునివ్వడంపై ప్రస్తావించగా ఎలాగనేది ఏపీ సమస్య కదా అని కవిత సమాధానమిచ్చారు. ప్రకాశం బ్యారేజీపై ఫొటో దిగడం ఆనందాన్నిచ్చిందన్నారు. తన తండ్రి కేసీఆర్, బ్రిటీష్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ తనకు స్ఫూర్తి అని కవిత తెలిపారు. సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడాలని కలలుగన్నానని, అయితే తండ్రి కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. చిన్ననాటినుంచే నాన్న కేసీఆర్‌తో కలిసి ప్రజాసమస్యల పరిష్కా రంలో పాలుపంచుకోవడం, రాజకీయ పరిజ్ఞానం పెంపొందించుకోవడం వల్ల రాజకీయాల పట్ల అభిరుచి కలిగిందని చెప్పారు. మహిళలు ఏ రంగంలోనైనా ముందడుగు వేయగలరని, నిజామాబాద్ జిల్లా బాలిక పూర్ణ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించడం దానికి ఉదాహరణ అని కవిత చెప్పారు. పార్లమెంటరీ కమిటీల్లో మహిళలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.