బాత్ రూమ్స్‌లోనే హార్ట్ అటాక్స్ ఎందుకొస్తాయంటే..!

Update: 2021-08-17 23:30 GMT
సాధారణంగా గుండెపోటు పెద్దలకు మాత్రమే వచ్చేది. అయితే, అది ఒకప్పుడు. ఇప్పుడు పిల్లలకు కూడా హార్ట్ అటాక్ వస్తున్నది. పాతికేళ్ల యువతీ యువకులు కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు. అయితే, చాలా మంది బాత్ రూమ్స్‌లోనే హార్ట్ అటాక్స్‌తో కుప్పకూలి ప్రాణాలు కోల్పోతుండటం మనం గమనించొచ్చు. ఇందులో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. వెండితెరపై వెలుగు వెలిగిన ప్రముఖ నటి, అతిలోక సుందరి బాత్ రూమ్‌లోనే కుప్ప కూలి మరణించినట్లు వార్తలొచ్చాయి. ఓ కథనం ప్రకారం.. హార్ట్ అటాక్ అని కొందరు అన్నారు. అయితే, ఇప్పటి వరకు ఆమె మృతికి గల కారణాలు ఫర్ఫెక్ట్‌గా తెలియరాలేదు. ఈ క్రమంలోనే బాత్ రూమ్స్‌లోనే హార్ట్ అటాక్ రావడానికి గల కారణాలేంటి? నిపుణులు ఏం చెప్తున్నారు? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీని ఫుల్లీ రీడ్ చేయాల్సిందే.

హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అనాలసిసస్ ప్రకారం.. హార్ట్ సంబంధిత డిసీజెస్‌తో బాధపడుతున్న వారు బాత్ రూమ్‌కు వెళ్లిన‌ప్పుడు అక్కడ గుండెపోటు వచ్చే చాన్సెస్ ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అమెరికా ఏజెన్సీ ఎన్సీబీఐ ప్రకారం..ప్ర‌పంచ‌వ్యాప్తంగా పదకొండు శాతం గుండెపోటు మరణాలు బాత్ రూమ్స్‌లోనే జరిగాయి. ఈ నేపథ్యంలోనే అక్కడే అనగా బాత్ రూమ్‌లోనే ఎలా మరణాలు సంభవిస్తున్నాయి? అనే విషయమై నిపుణులు పరిశోధన చేశారు. సాధారణంగా ఎవరైనా స్నానం చేసే క్రమంలో ముందుగా తలను తడుపుకుంటారు. దాని వల్ల వేడి రక్తం గల బాడీ చల్లటి ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంద.

ఫలితంగా అన్ని వైపుల నుంచి నర్వ్స్ ద్వారా మెదడకు బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుంది. ఈ క్రమంలోనే రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు ఉంటే హార్ట్ అటాక్ వస్తుందని నిపుణులు చెప్తున్నారు. చలికాలంలో బాత్ రూమ్స్‌లో త్వరగా బ్లడ్ ప్రెషర్, క్లాటింగ్ అయ్యే చాన్సెస్‌తో హార్ట్ అటాక్ రావొచ్చని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో స్నానం చేసేప్పుడు ముందుగా పాదాలను త‌డుపుకుని ఆ త‌ర్వాత పై వైపునకు వెళ్లాని ఎక్స్‌పర్ట్స్ సలహాలిస్తున్నారు. ఇక అధిక రక్తపోటు, మైగ్రేన్, కొలెస్ట్రాల్ ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు డైరెక్ట్‌గా తలస్నానం చేయకపోవడం మంచిదని వివరిస్తున్నారు.

గుండె సంబంధ రోగుల‌తో పాటు మలబద్ధకంతో బాధపడే వ్యక్తులు బాతింగ్ టైమ్‌లో జాగ్రత్తగా ఉండాలని, తల పైనుంచి స్నానం చేసే పద్ధతిని మార్చుకోవాలని చెప్తున్నారు. ఈ విషయమై వారి కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు స్నానం చేసే క్రమంలో ఎలా ఉంటున్నారు? అనేది గమనించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే జరిగిన పలు ఘటనలను పరిశీలిస్తే చాలా మంది స్నానం చేస్తూ చేస్తూనే హార్ట్ అటాక్ వచ్చి కుప్ప కూలిపోయి అక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ నేపథ్యంలో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు స్నానం చేసే క్రమంలో కుటుంబ సభ్యుల పరిశీలన ఉండాలని, తద్వారా ముప్పును ముందే పసిగట్టి సదరు వ్యక్తి ప్రాణాలు కాపాడుకోవచ్చని చెప్తున్నారు. ఇకపోతే బాత్ రూమ్స్‌లో హాట్ ప్లస్ కూల్ వాటర్ మిక్సింగ్ ఉండేలా ప్లాన్ చేసుకోవడం కూడా మంచిదని పేర్కొంటున్నారు నిపుణులు. చల్లటి నీరు ఒకేసారి హ్యూమన్ బాడీపై పోసుకోవడం వల్ల బాడీ హీట్ పెరిగే చాన్సెస్ ఉంటాయని, ఫలితంగా బ్లడ్ ప్రెషర్, నర్వ్స్‌పై ప్రెషర్ పెరుగుతుందని అంటున్నారు.
Tags:    

Similar News