ఎన్టీయార్ ఈ మూడు అక్షరాలూ తెలుగు జాతికి విడదీయని అందమైన బంధాలు. యుగ పురుషుడు శకపురుషుడు ఎన్టీయార్. ఆయన లాంటి నాయకుడిని తెలుగు జాతి మళ్ళీ చూస్తుంది అన్నది అత్యాశ మాత్రమే. ఎన్టీయార్ ప్రజా నాయకుడిగా సక్సెస్ అయ్యారు. రాజకీయ నాయకుడిగా ఫెయిల్ అయ్యారు. దానికి కారణం మనసు పెట్టి ఆయన పనిచేసి ప్రజల కోసం సేవ చేశారు వారి బాబు కోసం తపన పడ్డారు.
ఎన్టీయార్ లా పేదల కోసం పాటు పడిన నాయకుడు మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఆయన పేదలకు మేలు అంటే ఎంత వేగంగా యాక్షన్ లోకి దిగేవారు నాటి అధికారులే ఇప్పటికీ చెబుతూ ఉంటారు. అయితే ఎన్టీయార్ కి రాజకీయం తెలియదు. ఆయన అందరినీ నమ్మేవారు. భోళా శంకరుడు. అందుకే రెండు సార్లు ఆయన మీద వెన్నుపోటు జరిగింది.
ఇక రెండవసారి వెన్నుపోటు చరిత్రలో నిలిచిపోయేదే. ఆయనను సొంత కుటుంబ సభ్యులే గద్దే నుంచి దించేయడం దారుణం. బాధాకరం అని చరిత్ర చెబుతోంది. ఎన్టీయార్ తన చివరి రోజులలో మీడియాకు ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో సైతం తనను సొంత వారే అధికారం నుంచి తొలగిచ్నిన సంగతి చరిత్రలో పదిలంగా ఉంటుందని చెప్పడం విశేషం. ఔరంగజేబుకు నాడు జరిగినది తిరిగి ఇన్ని వందల తరువాత తనకు జరిగిందని, ఇది తెలుగు జాతికే తీరని అవమానం అని రామారావు కృద్ధుడై అన్న మాటలు నేటికీ యూ ట్యూబులలో కనిపిస్తాయి.
అసలు ఎన్టీయార్ ని ఎందుకు గద్దె దించాలనుకున్నారు. దాని వెనక కారణాలు ఏంటి అంటే ఆ కధ ఎన్ని సార్లు చెప్పుకున్నా ఇంకా తెలియని కోణాలు ఎన్నో ఉంటాయి. అలాంటిదే ప్రచారంలో ఉన్న మరో కధనం. ఇది కూడా చాలా ఆసక్తిని కలిగిస్తోంది. ఎన్టీయార్ ని గద్దె దించాలనుకున్నపుడు అవతల వారు చెప్పిన మాట ఏంటి అంటే ఆయన ఎమ్మెల్యేల మాట వినరని, వారితో సరిగ్గా మాట్లాడరని. అదే విధంగా ఆయన తన సతీమణి లక్ష్మీపార్వతి చెప్పినట్లుగా వింటున్నారని, ఆమెను రాజ్యాంగేతర శక్తిగా ముందుకు తెస్తున్నారని.
మరి ఎన్టీయార్ నే కొనసాగించాలీ అంటే ఆయన తన భార్యను రాజకీయాలకు దూరం పెట్టాలని ఎమ్మెల్యేలకు సమయం ఇచ్చి వారితో మాట్లాడాలని. అయితే తన భార్య ప్రమేయం రాజకీయాల్లో లేదని మొదటి నుంచి చెబుతూ వచ్చిన ఎన్టీయార్ ఆ తరువాత పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించి తన పట్టుదలని వీడారు. తాను ఎమ్మెల్యేల డిమాండ్ ని అంగీకరిస్తున్నట్లుగా కూడా అప్పట్లో ప్రచారం సాగింది.
తన భార్య ప్రమేయం ఉండదని, తాను మాత్రమే అన్నింటికీ బాధ్యుడిగా ఉంటానని, ఎమ్మెల్యేలను విశ్వాసంలోకి తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. నిజంగా ఎమ్మెల్యేలు ఎవరైతే ఎన్టీయార్ పట్ల వ్యతిరేకంగా ఉన్నారో వారి డిమాండ్లను ఆయన అంగీకరిస్తున్నపుడు చర్చలకు ఆహ్వానించినప్పుడు అసలు వివాదమే లేదు అనుకోవాలి. కానీ మధ్యలో ఏమి జరిగిందో తెలియదు కానీ ఎన్టీయార్ తగ్గాలని చూసినా కూడా ఆయన ఎమ్మెల్యేలతో మనసు విప్పి మాట్లాడాలని తాను స్వయంగా వైస్రాయ్ హొటల్ కి వచ్చినా కూడా ఆయన చైతన్య రధం మీద రాళ్లేసి మరీ రాకుండా చేశారు అని అంటారు.
మొత్తానికి ఆనాడు ఎన్టీయార్ తన ఎమ్మెల్యేలను కనుక కలుసుకుని ఉంటే కచ్చితంగా ఆయన మీద వెన్నుపోటు జరిగి ఉండేది కాదని, అలాగే ఎమ్మెల్యేలకు ఏర్పడిన అపార్ధాలు కూడా తొలగిపోయేవని చెబుతారు. మరి ఎన్టీయార్ ని ఏ విధంగా చూసినా గద్దె దించాల్సిందే అని ఒక పకడ్బంధీ ప్రణాళిక అమలు చేయాలన్న బలమైన ఉద్దేశ్యం ఉండడం వల్లనే ఎన్టీయార్ వైస్రాయ్ హొటల్ దాకా వచ్చినా కూడా చర్చల ప్రతిపాదనలకు అడ్డుకట్ట వేశారు అని అంటున్నారు. అలా చేసిన వారు ఎవరో అందరికీ తెలిసిందే. అందుకే ఎన్టీయార్ నాకు నా ఎమ్మెల్యేలను కాకుండా చేశారు అని వాపోయారు. ఆ బాధతోనే ఆయన చివరి రోజూలలో తీవ్రంగా కలత చెందుతూ మరణించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.