విశాఖ ఉక్కుపై ష‌ర్మిల మౌన‌మేల‌?

Update: 2021-03-13 09:56 GMT
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హ‌క్కుగా పోరాడి సంపాయించుకున్న ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌. సుదీర్ఘ పోరాటం, ప్రాణ త్యాగాల ఫ‌లితంగా ఈ ప‌రిశ్ర‌మ ఏపీలో ఏర్పాటు అయింది. దాదాపు 20 వేల మంది కార్మికులు ప్ర‌త్య‌క్ష్యంగా అంత‌కు నాలుగింత‌ల మంది ప‌రోక్షంగా ఈ ప‌రిశ్ర‌మ‌పై ఆధార‌ప‌డి జీవిస్తున్నారు. అయితే... కేంద్ర ప్ర‌భుత్వం ఉద్దేశ పూర్వ‌కంగా ఈ క‌ర్మాగారానికి శాశ్వ‌త గ‌నుల‌ను కేటాయించ‌ని కార‌ణంగా.. ఉత్ప‌త్తి కోసం వేరే చోట నుంచి ముడి ఇనుమును సేక‌రించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో ఇక్క‌డి ఉత్ప‌త్తి వ్య‌యం భారీ గా పెరిగిపోయింది.

దీంతో విశాఖ ఉక్కులో న‌ష్టాలు వ‌స్తున్నాయ‌ని కేంద్రం త‌ర‌చుగా చెబుతున్న‌మాట‌.. ఇక‌, ఇప్పుడు కేంద్రం లోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు ఏకంగా దీనిని ప్రైవేటుకు విక్ర‌యించేందుకు రెడీ అయింది. అయితే.. అది కూడా కారు చౌక‌గా క‌ట్ట‌బెడుతుండ‌డం గ‌మ‌నార్హం. అంటే. దాదాపు 3 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల విలువైన విశాఖ ఉక్కుసంప‌ద‌ను కేవ‌లం 32 వేల కోట్ల‌కు అమ్మ‌తున్నారు. దీనిని జీర్ణించుకోలేక‌.. విశాఖ స‌హా ఏపీ ప్ర‌జ‌లు, పార్టీల నేత‌లు ఈ విష‌యంపై ఉద్య‌మ బాట ప‌ట్టారు. ఇక‌, తెలుగు వారికి తోడుగా నిలిచేందుకు కేంద్రంలోని మోడీ స‌ర్కారు దూకుడుకు అడ్డుక‌ట్ట వేసేందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా రెడీ అయ్యారు..

ఏపీ సోద‌రుల‌తో క‌లిసి విశాఖ ఉక్కుపై పోరాడేందుకుతాము రెడీ గా ఉన్నామ‌ని. ముఖ్య‌మంత్రి కేసీఆర్ అనుమ‌తి తీసుకుని అవ‌స‌ర‌మైతే... తాము కూడా విశాఖ వెళ్లి.. అక్క‌డ ఉద్య‌మానికి ప్ర‌త్య‌క్ష మ‌ద్ద‌తు ఇస్తామ‌ని కూడా కేటీఆర్ ప్ర‌క‌టించారు.. మ‌రి ఈ నేప‌థ్యంలో ఏపీ సీఎం జ‌గ‌న్ సోద‌రి, తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీ ఏర్పాటుకు రెడీ అవుతున్న‌ ష‌ర్మిల మాత్రం ఇప్ప‌టి వ‌రకు ఏమాత్రం స్పందించ‌లేదు. తెలుగు వాళ్ల‌కు అన్యాయం జ‌రుగుతుండే మాట్లాడ‌క‌పోవ‌డం.. కీల‌క‌మైన విశాఖ ఉక్కును కేంద్రం హ‌రించేసేందుకు సిద్ధ‌మైనా మౌనం పాటించ‌డాన్ని రాజ‌కీయ వ‌ర్గాలు త‌ప్పుబ‌డుతున్నాయి.

ఎంత‌సేపు చూసినా.. రాజ‌న్న రాజ్యం రావాల‌ని ష‌ర్మిల నిన‌దిస్తున్నారే త‌ప్ప‌.. సాటి తెలుగు వారు.. పొరుగు రాష్ట్రం, పైగా త‌న సోద‌రుడు జ‌గ‌న్ సీఎంగా ఉన్న రాష్ట్రంలో కేంద్రం చేస్తున్న దుందుడుకు వ్య‌వ‌హారంపై మాత్రం మౌనంగా ఉండ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురిచేస్తోంది. ఏదో కొంద‌రు పెయిడ్ ఆర్టిస్టుల‌ను చేర‌దీసి.. వారితో మీటింగులు పెట్టి.. కాలం గ‌డుపుతున్నారంటూ.. ష‌ర్మిల గురించి లోట‌స్ పాండ్‌ దగ్గర గుసగుసలు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. వైఎస్ జీవించిన రోజుల్లో విశాఖ ఉక్కును కాపాడే బాధ్య‌త తీసుకున్నారు. అయితే.. ఆయ‌న కుమార్తె, ఏపీ బిడ్డ‌, తెలంగాణ కోడ‌లు అని చెప్పుకొనే ష‌ర్మిల మాత్రం తెలుగు వారికి ఆప‌ద వ‌స్తే.. మాత్రం స్పందించదా?, ఇదెక్క‌డి న్యాయం? అంటున్నారు సీనియ‌ర్ నాయ‌కులు.
Tags:    

Similar News