ఎర్ర‌బుగ్గ‌ను ఎందుకు తొల‌గించాలంటున్న సీఎం

Update: 2017-04-25 12:35 GMT
కర్ణాటక సీఎం సిద్దరామయ్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వీవీఐపీ సంస్కృతికి ముగింపు పలుకుతూ కేంద్రం ప్రభుత్వ అధికారిక వాహనాలపై ఉన్న ఎర్రబుగ్గలను మే 1 నుంచి తొలగించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ నిర్ణయం మేరకు ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు తమ వాహనాలపై ఉన్న ఎర్రబుగ్గను స్వచ్ఛందంగా తొలగించారు. అయితే క‌ర్ణాటక సీఎం సిద్దరామయ్య మాత్రం దీనికి మొండికేశారు. తన వాహనంపై ఎర్రబుగ్గ తొలగించకపోవడంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు కాస్త భిన్నంగా స్పందించారు.

``మే 1 నుంచి నిర్ణయం అమలులోకి రానుంది. ఎర్రబుగ్గను ఇప్పడు ఎందుకు తొలగించాలి? ఎప్పటి నుంచి నిర్ణయం అమలవుతుందో అపుడే ఎర్రబుగ్గను తొలగిస్తాను`` అంటూ కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి అయిన సిద్ధ‌రామ‌య్య సమాధానమిచ్చారు. కాగా, రాష్ట్రంలో ఎన్నిక‌ల వాతావార‌ణం నెల‌కొన్న నేప‌థ్యంలో సిద్ధ‌రామ‌య్య వివిధ ప్రాంతాల్లో బిజీబిజీగా ప‌ర్య‌టిస్తున్నారు. ప‌లు సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుడుతున్నారు. ఇలా ప‌ర్య‌టించేందుకు సిద్ధ‌మై శ్రావ‌ణ‌బెళ‌గోళ‌కు వెళుతున్న స‌మ‌యంలోనే నిన్న ఆయ‌న హెలీకాప్ట‌ర్ స్వ‌ల్ప‌ప్ర‌మాదానికి గురైంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News