సవితితల్లితో సన్నీడియోల్.. కూర్చోలేరట..

Update: 2019-05-29 11:10 GMT
కేంద్రంలో కొత్త బీజేపీ ప్రభుత్వం కొలువుదీరుతోంది. ఈసారి ఎంతో మంది కొత్త ఎంపీలు,పాత ఎంపీలు పార్లమెంట్ లో అడుగుపెట్టబోతున్నారు.  జూన్ 6న తొలి లోక్ సభ సమావేశాలు నిర్వహించి ఎంపీల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక ఏ ఏంపీ ఎక్కడ కూర్చోవాలనే ఇప్పటికే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఈసారి లోక్ సభకు 300 మంది కొత్త ఎంపీలు తొలిసారి ఎన్నికయ్యారు. బాలీవుడ్ హీరో  సన్నీ డియోల్ తోపాటు సింగర్ హన్స్ రాజ్, క్రికెటర్ గౌతం గంభీర్, సాధ్వీ ప్రజ్ఞాసింగ్, నటుడు రవికిషన్ లు సెలెబ్రెటీలుగా ఉన్నారు. వీరు సెలబ్రెటీలు అయినా కొత్త వారు కావడంతో వెనుక బెంచీల్లోనే వీరికి సీట్లను కేటాయిస్తున్నారు. ముందు సీట్లలో ఒకటి కంటే ఎక్కువసార్లు ఎంపీగా గెలిచినవారికే చాన్స్ ఉంటుంది.

ఇక సన్నీడియోల్.. ఆయన సవతి తల్లి అయిన రెండోసారి గెలిచిన హేమమాలిని పక్కపక్కనే కూర్చునే భాగ్యం ఈసారి కుదరడం లేదు. రెండోసారి గెలిచిన హేమమాలినికి మధ్య బెంచీల్లో సీటు కేటాయించారు.  ఇక తొలిసారి గెలిచిన సన్నీ డియోల్ కు వెనుక బెంచీల్లోనే సీటు కేటాయించారు.

స్పీకర్ కుడివైపు అధికార పక్షం.. మిత్రపక్షాలు.. ఎడమ వైపు ప్రతిపక్షాలు కూర్చుంటాయి. ఇక మధ్యలో ఉన్న బెంచీలు సీనియారిటీ ప్రకారం కేటాయిస్తారు. ఇక తొలిసారి గెలిచిన వారిని చివరి బెంచీల్లో కూర్చుండబెడుతారు. వారికి మంత్రి పదవి వస్తే మాత్రం ముందే సీటు ఇస్తారు. ఇలా సవతి తల్లితో కలిసి కూర్చునే అవకాశం ఈసారి సన్నీడియోల్ కు దక్కడం లేదు.


Tags:    

Similar News