MRO ని హత్య చేసిన సురేష్ మరో ఆపరిచితుడా!

Update: 2019-11-06 01:30 GMT
అబ్దుల్లాపూర్ మెట్  తహసీల్దార్ దారుణ హత్య పై విచారణ జరిగే కొద్ది  పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సోమవారం తహసీల్దార్  కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో డైరెక్ట్ గా  రూమ్ లోకి వెళ్లి తాను చెప్పిన మాట వినలేదనే కోపం తో తన వెంట తెచ్చుకున్న పేట్రోల్ పోసి నిప్పుపెట్టాడు నిందుతుడు సురేష్  సోమవారం ఎప్పటిలాగే  ప్రజా దర్బార్ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే లంచ్ సమయం కావడంతో, పిర్యాదులు తీసుకునే అధికారి అక్కడి నుంచి వెళ్లారు. అదే సమయంలో అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి తన రూంలో ఉన్నారు. ఈ సమయంలో ఆమె తో తన భూముల విషయం పై మాట్లాడటానికి వచ్చిన సురేష్ .. mro తో మాట్లాడుతుండగా ..ఇద్దరి మధ్య మాట మాట పెరిగిపోయింది.

ఆ తర్వాత వెంట తీసుకొచ్చిన బాటిల్‌లోని పెట్రోల్‌ను ఆ ఎమ్మార్వో పై పోసి. నిప్పంటించాడు. ఆ  మంటల్లో చిక్కుకుని తహశీల్దార్ విజయారెడ్డి అక్కడే సజీవదహనం అయ్యారు. ఈ ఘటనలో నిందితుడు సురేష్ కూడా తనకు తాను పెట్రోల్ పొసుకుని నిప్పంటించుకున్నాడు.  ఎమ్మార్వోను కాపాడే ప్రయత్నం చేసిన ఇద్దరు సిబ్బంది కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. అందులో విజయారెడ్డి డ్రైవర్ గురునాథం చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.

ఈ కేసు ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగింది. తాజాగా మరో వాదన బయటకి వచ్చింది. ముఖ్యంగా నిందితుడి సురేష్ మనస్తత్వం పై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. మరో విషయం   ఏమిటంటే  తన భూమికి సంబంధించిన కేసు కోర్టులో ఉంది. అయితే అదే సమయంలో పాస్‌బుక్‌ అప్డేట్ చెయ్యాలంటూ.. ఎమ్మార్వోను సంప్రదించినట్లు తెలుస్తోంది. మరోవైపు నిందితుడి తల్లిదండ్రులు ఈ ల్యాండ్ విషయం గురించి తమకేం తెలిదనడం  ఆశ్చర్యంగా ఉంది. సురేష్ ప్రవర్తన .. అపరిచితుడు సినిమాలో  విక్రమ్ లా  ఉంటుందని గ్రామస్థుల ద్వారా తెలుస్తోంది.  

తనకు సంబంధించిన విషయం పై ఖచ్చితంగా ఉంటూ  తనకు అనుకూలంగా వ్యవహరించక పోతే, ప్రభుత్వాధికారులతో తరుచూ గొడవ పడే మనస్తత్వం అని తెలుస్తోంది. ట్రాఫిక్ పోలీసులు బండి ఆపితే.. డాక్యు మెంట్లు అన్నీ చూపిన తర్వాత.. సదరు అధికారి తనను పట్టించు కోకపోతే.. వారిపై కూడా వాగ్వాదానికి దిగేవాడని తెలుస్తోంది. తన దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నా,  తనను పంపించకుండా  ఎందుకు తన సమయాన్ని వృథా చేస్తున్నారంటూ గొడవ పడిన  సందర్భాలు అనేకమని తెలుస్తోంది.

తన సమస్య అనుకున్న సమయంలో పరిష్కారం కాకపోతే.. తీవ్ర ఒత్తిడికి గురై వారితో ఘర్షణ పడే అలవాటు ఉందని తెలుస్తోంది. అయితే ఈ వీక్ పాయింట్‌ను అవకాశంగా తీసుకుని.. ఏవరైనా సురేష్‌ ను ఎమ్మార్వో విజయా రెడ్డి ని హతమార్చేందుకు ఉసిగొల్పి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాస్ బుక్ కోసం చాలా రోజులుగా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నానని, లంచం అడిగినందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సురేష్ పొలీసు విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News