ఆస్ట్రాజెనికాపై నిషేధం ఎందుకు? అసలు కథ ఏమిటి?

Update: 2021-03-16 09:30 GMT
ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తయారుచేసిన అస్ట్రాజెనికా అనే టీకాపై ప్రపంచవ్యాప్తంగా నీలి నీడలు కమ్ముకొంటున్నాయి. ఆ వ్యాక్సిన్​తో రక్తనాళలు గడ్డ కడుతున్నాయన్న ఫిర్యాదుతో పలుదేశాలు వ్యాక్సిన్​ను నిషేధిస్తున్నాయి. ఇదిలా ఉంటే డబ్ల్యూహెచ్​వో మాత్రం ఈ వ్యాక్సిన్​తో ఏ ఇబ్బంది లేదని.. ఎటువంటి సైడ్​ ఎఫెక్ట్స్​ లేవని వాదిస్తున్నది. దీంతో ఆ వ్యాక్సిన్​పై నీలినీడలు కమ్ముకొన్నాయి. అయితే ఈ వ్యాక్సిన్​కు సంబంధించిన వివిధ దేశాలు వ్యక్తం చేస్తున్న సందేహాలు సరైనవేనా? డబ్ల్యూహెచ్​వో చేస్తున్న వాదనల్లో నిజమెంత? ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ దేశాలు ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వాక్సినేషన్​ నిలిపివేశాయి. యూరప్‌లో ఈ వాక్సీన్ తీసుకున్న వారిలో కొందరికి రక్త నాళాల్లో గడ్డలు ఏర్పడ్డాయి. కొన్ని మరణాలు కూడా సంభవించాయి. దీంతో ఆయా దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా నెదర్లాండ్స్, ఐర్లండ్ సహా పలు ఇతర యూరప్ దేశాలు ఆస్ట్రాజెనెకా వాక్సీన్ ను నిలిపివేశాయి.  ఈ వ్యాక్సిన్​తో రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడుతున్నాయి అనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్​వో అంటున్నది.

ఆస్ట్రాజెనెకా వాదన ఏమిటి?

వ్యాక్సిన్​తో రక్త నాళాల్లో గడ్డలు (బ్లడ్ క్లాట్స్) కట్టడాన్ని ఆస్ట్రాజెనికా కొట్టి పారేస్తున్నది.  దాదాపు 1.7 కోట్ల మంది ఈ వాక్సీన్ డోసు తీసుకున్నారని.. వారిలో కేవలం 40 శాతం మందికి మాత్రం ఈ సమస్యలు వచ్చినట్టు ఆస్ట్రాజెనికా ఒప్పుకున్నది. అది చిన్న సమస్యే అని ఆస్ట్రాజెనికా అంటున్నది.  వ్యాక్సిన్ వల్ల రక్తంలో గడ్డలు తయారవుతున్నాయని ఆధారాలు సూచించటం లేదని బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ పేర్కొంది.
Tags:    

Similar News