హలోవీన్ పండుగ వెనుక ఉన్న మర్మం ఏమిటంటే?

Update: 2022-10-30 07:30 GMT
ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలను బట్టి అక్కడి ప్రజలు కొన్ని నమ్మకాలు.. మత విశ్వాసాలను పాటిస్తూ ఉంటారు. మన పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన కొన్ని పండుగలు సంప్రదాయ రూపంలో ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాం. ఇలాగే దక్షిణ కొరియాలో రెండు వేల ఏళ్ళ నుంచి ఓ పండుగను అక్కడి ప్రజలు ఎంతో నమ్మకంతో చేస్తూ అందరి దృష్టిని తమవైపు ఆకర్షిస్తున్నారు.  

ఐరోపా దేశాల్లో నవంబర్ 1న కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు. దీనికి ఒక రోజు ముందే హాలోవీన్ పండుగను అక్కడి ప్రజలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా సెల్ట్స్ జాతి ప్రజలు ఈ పండుగ విశేషంగా జరుపుకుంటారు. చనిపోయిన తమ పూర్వీకులు ఆత్మల రూపంలో భూమిపైకి వస్తారని వారంతా నమ్ముతారు.

కొత్త సంవత్సరానికి ముందు అంటే అక్టోబర్ 31న రాత్రి సమయంలో తమ పూర్వీకులు ఆత్మల రూపంలో భూమిపైకి వస్తారని భావిస్తారట. దీంతో ఈ రోజున సెల్ట్స్ సంహైన్ పండుగను జరుపుకుంటారు. ఇందులో భాగంగా పంటలను, జంతువులను కాల్చివేసే ప్రదేశాల్లో సెల్టిక్ ప్రీస్ట్‌లు మంటలను వేయడం.. వారి దేవతలకు బలి ఇస్తున్నట్టు కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

ఈ వేడుకల్లో భాగంగా సెల్ట్స్ జాతి ప్రజలు జంతువుల తలలు, చర్మాలు వంటి దుస్తులను ధరిస్తుంటారు. క్రీ.శ 8 వ శతాబ్దంలోనే పోప్ గ్రెగరీ-3 నవంబర్ 1న సాధువులను గౌరవించాలని ప్రకటించారు. ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతూ వస్తోంది. అయితే కాలక్రమంలో రోమన్ పండుగలైన పోమెనా.. ఫెరాలియా ఆల్ సెయింట్స్ డే.. సంహైన్ పండుగల సంప్రదాయాలు ఇందులో మిళిత మయ్యాయి.

తాజాగా దక్షిణ కొరియాలో హాలోవీన్ వేడుకలు నిర్వహిస్తుండగా తొక్కిసలాట జరిగింది. దీంతో సుమారు 150 మంది ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. ఈనేపథ్యంలోనే హాలోవీన్ పండుగ ప్రత్యేకత పై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దీంతో హాలోవీన్ పండుగ విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

హాలోవీన్ అనే పదం స్కాట్లాండ్ కు చెందిన పదం. 'ఆల్ హాలో ఈవ్' అనే పదాల నుంచి హాలోవీన్ పదం ఉద్భవించింది. ఈ పండుగలో భాగంగా యూరోపిన్ ప్రజలు ట్రిక్-ఆర్-ట్రీటింగ్.. కాస్ట్యూమ్ పార్టీలకు హాజరవుతుంటారు. గుమ్మడికాయలను చెక్కడం.. భోగి మంటలు వెలిగించడం.. ఆటలు.. హాలోవీన్ నేపథ్య చిత్రాలు చూడటం వంటివి చేస్తుంటారు.

సెల్టిక్ పండుగ రోజున మంటలను వెలిగించి.. దెయ్యాలను పారదోలాలనే ఆలోచనతో అక్కడి ప్రజలు విచిత్రమైన దుస్తులు ధరించడం తోపాటు జంతువులను బలిచ్చే కార్యక్రమాలు చేస్తుంటారు. క్రమంగా ఈ సంప్రదాయం ఐర్లాండ్.. బ్రిటన్ నుంచి వలసల వల్ల అమెరికాకు పాకింది. కాలక్రమంలో ఈ  హాలోవీన్ పండుగ జరుపుకునే తీరు సైతం మారిపోయింది.
Tags:    

Similar News