గౌతం గంభీర్ ఫౌండేషన్ ఎందుకు ఇబ్బందుల్లో ఉంది

Update: 2021-06-04 00:30 GMT
భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ చిక్కుల్లో పడ్డారు. ఆయన  రాజకీయ నాయకుడిగా.. బీజేపీ ఎంపీగా మారినప్పటి నుండి ఎప్పుడూ వివాదాస్పద ప్రకటనలతో వార్తల్లో నిలుస్తున్నాడు.  తన గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ (జిజిఎఫ్) ద్వారా అవసరమైన ఔషధాలు సరఫరా చేస్తూ ఆపదలో ఉన్నవారి సహాయం చేచేస్తున్నాడు. కరోనా మహమ్మారి విస్తృతంగా ఉన్న ఢిల్లీలో గంభీర్ ఫౌండేషన్ కరోనా బాధితులకు అండగా నిలుస్తోంది.

అయితే తాజాగా గంభీర్ ఫౌండేషన్ చిక్కుల్లో పడింది. కోవిడ్ -19 చికిత్సకు సంబంధించిన ఔషధాలను అనధికారికంగా నిల్వ చేయడం దుమారం రేపింది.  ప్రధానంగా ఫాబిఫ్లూ నిల్వ చేస్తున్నట్లు తెలియగానే గంభీర్ ఫౌండేషన్ పెద్ద వివాదంలోకి చిక్కుకుంది.  వాస్తవానికి గంభీర్ స్వయంగా తన జీజీఎఫ్‌లో అందుబాటులో ఉన్న ఔషధాల గురించి ట్వీట్ చేశాడు. ఉచితంగా అవసరం ఉన్న వ్యక్తులకు ఇచ్చి సాయం చేస్తున్నాడు.

ఢిల్లీలోని ఏదైనా మెడికల్ స్టోర్స్ ఈ ఔషధాన్ని పొందలేకపోతున్న వారికి గంభీర్ ఫౌండేషన్ ఉచితంగా అందిస్తోంది. కొంతమంది నెటిజన్లు ఇలా ఎలా అన్ని మందులను గంభీర్ నిల్వ చేస్తున్నాడని సందేహాలను వ్యక్తం చేశారు, చివరకు ఈ విషయం ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది. కోర్టు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ను గంభీర్ సేకరిస్తున్న ఔషధాలపై వివరణ కోరింది.

దర్యాప్తు తరువాత అధికారం లేకుండా కోవిడ్19 రోగులకు  ఇచ్చే ఫాబిఫ్లూ ఔషధాన్ని నిల్వ చేయడం, సేకరించడం.. పంపిణీ చేయడంలో గంభీర్ ఫౌండేషన్ దోషి అని తేలింది. దీంతో ఇదే విషయాన్ని  డిసిజిఐ ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. నివేదికలో గంభీర్ ఫౌండేషన్..  ఏజెన్సీ లేదా ప్రభుత్వ అధికారుల నుండి ముందస్తు అనుమతి లేకుండా ఔషధాన్ని సరఫరా చేస్తున్నారని.. ఇతర ఎన్జీఓలపై తగిన చర్యను తీసుకోవాలని కోరింది.

గంభీర్ ఫౌండేషన్ నేరం డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ చట్టం కింద కేసులు నమోదు చేసింది.  ఎలాంటి శిక్ష విధిస్తారన్నది ఇంకా నిర్ణయించబడలేదు. గౌతమ్ గంభీర్ డిసిజిఐ నివేదికపై ఇంకా స్పందించలేదు. ఏం జరుగుతుందనేది ఆసక్తి రేపుతోంది.
Tags:    

Similar News