నారా లోకేష్ ను హీరో చేస్తున్నది ఏపీ ప్రభుత్వమే అని చెప్పడంలో సందేహం లేదు. ఏ విషయంలో అయినా బాధితులను పరామర్శించటం ప్రతిపక్షనేతల ప్రథమ బాధ్యత. ఆ సమయంలో అచ్చం రాజకీయమే చేస్తారనటంలో సందేహంలేదు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా ఇలాగే చేసింది. ప్రతిపక్ష నేతలు వస్తారు, బాధితులను పరామర్శిస్తారు, మీడియాతో మాట్టాడుతారు, వెళిపోతారు. మరి ఇంతోటి దానికి లోకేష్ పర్యటన విషయంపై పోలీసులు ఎందుకింత రాద్దాంతం చేశారో అర్థం కావట్లేదు.
అప్పుడెప్పపుడో అంటే పిబ్రవరిలో నరసరావు పేటలో చనిపోయిన అనూష కుటుంబాన్ని పరామర్శించటానికి లోకేష్ హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. విమానాశ్రయంలోనే లోకేష్ ను పోలీసులు అడ్డుకుని పెద్ద సీన్ క్రియేట్ చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే లోకేషే కాదు ప్రతిపక్ష నేతల్లో ఎవరి పర్యటనను కూడా పోలీసులు అడ్డుకోవాల్సిన అవసరం లేదు.
మొన్నటికి మొన్న గుంటూరులో హత్యకు గురైన రమ్య విషయంలో కూడా లోకేష్ ఇలాగే వ్యవహరించారు. రమ్య హత్యకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యం ఎక్కడా లేదు. ఆమె ప్రియుడే ఆమెను క్షణికావేశంలో హత్య చేస్తే దానికి ప్రభుత్వానికి ఏమి బాధ్యతుంది. హత్య జరిగిన 24 గంటల్లోనే హంతకుడిని పోలీసులు పట్టుకున్నారు. తర్వాత విచారించి కోర్టులో కూడా ప్రవేశపెట్టారు. అంతకుముందు ఫిబ్రవరిలో జరిగిన అనూష హత్య విషయంలో కూడా పోలీసులు వెంటనే హంతకుడిని పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ చెప్పారు.
ఇంతోటి దానికి పోలీసులు ఎందుకింత చేస్తున్నారో తెలీటం లేదు. జరిగిన ఘటన ఏమిటో అందరికీ తెలుసు. అలాగే పోలీసులు ఏమి చేశారో కూడా జనాలు చూశారు. ఘటనను రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నదెవరో అర్ధం చేసుకోలేనంత అమాయకులు కారు జనాలు. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం లేదా పోలీసులు ఓవర్ యాక్షన్ మానేస్తే బాగుంటుంది. లేకపోతే ప్రభుత్వమే లోకేష్ ను చాలా పెద్ద నేతగా చేసినట్లవుతుంది.