40 రోజులు గ‌డిచిన‌ పోలీసులు ఛార్జిషీట్ న‌మోదు చేయ‌లేద‌ట!

Update: 2022-07-02 09:41 GMT
ఆ ఎమ్మెల్సీ కేసును పోలీసులే నీరుగారుస్తున్నారా? మాన‌వ హ‌క్కుల  క‌మిష‌న్ ఎదుట కూడా పోలీసులు త‌ప్పించుకు తిరుగుతూ, నిబంధ‌న‌లు పాటించ‌డం లేదా ? ఇవే ప్ర‌శ్న‌లు నిన్న‌టి వేళ వినిపించాయి.. ఆ వివ‌రం ఈ  క‌థ‌నంలో..
 
సుదీర్ఘ కాలంగా వివాదాల‌కు నెలవు అవుతున్న ఎమ్మెల్సీ అనంత బాబు ప్ర‌వ‌ర్త‌న, ఆయ‌న తీరు తెన్నులు ఇప్పుడు మళ్లీ మ‌ళ్లీ వార్త‌ల్లో నిలుస్తున్నాయి. గ‌తంలో ఇక్క‌డ ప‌నిచేసిన ఎమ్మెల్యే వంత‌ల రాజేశ్వ‌రి కూడా త‌న గౌర‌వ‌వేతనాన్ని కూడా ఆయ‌నే తీసుకునే వాడ‌ని చెబుతూ కీల‌క వ్యాఖ్య‌లు కొన్ని చేశారామె.

తాజా వివ‌రం ప్ర‌కారం ఎమ్మెల్సీ అనంత‌బాబు ఉదంతంలో డ్రైవ‌ర్ ను ఆయ‌న హ‌త్య చేసిన కేసుకు సంబంధించిన నేరంలో ఇప్ప‌టిదాకా ఛార్జిషీట్ దాఖ‌లు కాలేద‌ని పౌర హ‌క్కుల సంఘం రాష్ట్రాధ్య‌క్షులు, న్యాయ‌వాది ముప్పాళ్ల సుబ్బారావు చెబుతున్నారు.

డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య జరిగి 40 రోజులు గ‌డిచిన‌ప్ప‌టికీ ఇప్ప‌టి వ‌ర‌కూ పోలీసులు ఛార్జిషీట్ న‌మోదు చేయ‌లేద‌ని అంటున్నా రాయ‌న. ఆరోపిస్తూ ఉన్నారాయ‌న. ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల‌లో వైర‌ల్ అవుతున్న టాపిక్.

తాజాగా మరోసారి రాజ‌మండ్రి సబ్ క‌లెక్ట‌రేట్ కార్యాల‌యంలో అనంత‌బాబును మాన‌వ‌హక్కుల క‌మిష‌న్ విచారించిన నేప‌థ్యంలో కేసు వివ‌రాల‌ను ముప్పాళ్ల సుబ్బా  రావు వివ‌రించేందుకు మీడియా ముందుకు వ‌చ్చారు.

కేసును పోలీసులే నీరుగార్చేందుకు చూస్తున్నార‌ని ఆరోపిస్తూ,ఈ  విష‌యా న్ని మాన‌వ‌హక్కుల క‌మిష‌న్ దృష్టికి తీసుకువెళ్లామ‌ని చెప్పారు. విచార‌ణ స‌మ‌యంలో ఎస్సీ, ఎస్టీ చ‌ట్టం 15 ఏ ప్ర‌కారం వీడియో తీయాల్సి ఉండగా ఆవిధంగా ఏమీ జ‌ర‌గ‌లేద‌ని చెప్పారు.
Tags:    

Similar News