సైబరాబాద్ నంబరును వాట్సాప్ ఎందుకు బ్లాక్ చేసింది?

Update: 2019-12-09 09:19 GMT
మీరైదేనా ఆపదలో ఉన్నా.. సాయం కోసం ఎదురుచూస్తున్నా.. ఫిర్యాదు చేయాలన్నా తమకు సమాచారం ఇవ్వొచ్చంటూ పలు సంస్థలు వాట్సాప్ నెంబర్లను పోస్టు చేయటం తెలిసిందే. అయితే.. ఇలా ప్రకటించిన ఏ సంస్థకు చెందిన నంబరును వాట్సాప్ కంపెనీ బ్లాక్ చేసింది లేదు. కానీ.. అందుకు భిన్నంగా సైబరాబాద్ పోలీసులు నిర్వహించే వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబరును బ్లాక్ చేస్తూ వాట్సాప్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

ఎందుకిలా? అంటే దిశ ఉంతం తర్వాత సైబరాబాద్ వాట్సప్ నెంబరుకు అపరిమితంగా మెసేజ్ లు వచ్చాయి. దీంతో.. సైబరాబాద్ వాట్సాప్ హెల్ప్ లైన్ అయిన 9490617444 నెంబరుపై వాట్సాప్ యాజమాన్యం అనుమానం వ్యక్తం చేసి.. సేవల్ని నిలిపివేసింది. అయితే.. జరిగిన ఉదంతాన్ని పేర్కొంటూ సైబరాబాద్ పోలీసులు తమ వాట్సాప్ నెంబరును పునరుద్దరించాలని కోరుతూ ఈమెయిల్ చేశారు.

మరోవైపు వాట్సాప్ స్పందించి.. నెంబరు పునరుద్దరించే వరకూ ఇబ్బంది లేకుండా ఉండేందుకు మరో నెంబరును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. పాత నెంబరు తిరిగి పని చేసే వరకూ ఏవరికైనా ఏదైనా అవసరం అయితే 79011 14100 నెంబరుకు వాట్సాప్ చేయాలని సైబరాబాద్ పోలీసులు కోరుతున్నారు.
Tags:    

Similar News