టీ20 సీరిస్ మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జానీ బెయిర్ స్టోకు .. యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది.
ఇంగ్లండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్ స్టోపై టీమిండియా యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 5 టీ20ల సిరీస్‌లో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20లో భారత్‌పై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్ సందర్భంగా సుందర్, బెయిర్ స్టోల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు అంపైర్, టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..
టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్సింగ్స్ నడుస్తున్నది. 13 వ ఓవర్లో ఆఖరిబంతిని డేవిడ్ మలన్ ఎదుర్కొన్నాడు. అతడు స్ట్రెయిట్ షాట్ అడాడు. అనంతరం పరుగు తీసేందుకు ముందుకెళ్లాడు. అయితే ఈ బంతిని క్యాచ్ పట్టేందుకు వాషింగ్టన్ సుందర్ ముందుకొచ్చాడు. ఈ క్రమంలో ఒకరికొకరు ఢీ కొట్టుకోవడంతో వాషింగ్టన్సుందర్కు క్యాచ్ పట్టే అవకాశం మిస్ అయ్యింది. దీంతో అతడు డేవిడ్ మలన్‌పై సీరియస్ అయ్యాడు. ఓ దశలో ఇద్దరు తిట్టుకోవడంతో రచ్చ రచ్చగా మారింది. చివరకు ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ జోక్యం చేసుకొని ఇద్దరికీ నచ్చ జెప్పాడు.
వాషింగ్టన్ సుందర్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు.. బెయిర్ స్టోపై గట్టిగా అరిచాడు. అయితే వికెట్ కీపర్ రిషబ్ పంత్ జోక్యం చేసుకొని వాషింగ్టన్ సుందర్‌ను వారించాడు. దీంతో వివాదం ముగిసింది. అయితే ఆ తర్వాత ఓవర్లో సుందర్.. బెయిర్ స్టో కావాలని అలా చేయలేదని తెలుసుకొని అతడికి క్షమాపణలు చెప్పాడు.
అతడు సుందర్ భుజంపై చేయి వేస్తూ పర్లేదంటూ.. ఆటలో ఇదంతా కామన్ అంటూ వెన్ను తట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చరచ్చగా మారింది. ఇవాళ సాయంత్రం రెండో టీ20 జరగనున్నది. మొదటి టీ20 లో ఓడిపోయిన టీమిండియా .. ఇవాళ ఎలాగైనా గెలవాలని చూస్తున్నది.