ట్రంప్ కు ఓటేసిన భర్తకు షాకిచ్చిన భార్య

Update: 2016-11-13 16:13 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తారని ఎవరూ ఊహించనిది. హిల్లరీ గెలుపు పక్కా అని.. సాంకేతికంగా ఆమె విజయం సాధించారన్న సమాచారం బయటకు రావటమే మిగిలి ఉందన్నట్లుగా అంచనాలు వ్యక్తమయ్యాయి. అయితే.. ఇందుకు భిన్నంగా ట్రంప్ విజయం సాధించటంతో అమెరికాతో సహా.. ప్రపంచం మొత్తానికి షాకింగ్ గా మారింది. అయితే.. ట్రంప్ విజయం వెనుక అమెరికన్లలో ఎక్కువ మంది ఆయనకు గుట్టుగా ఓటు వేయటమే కారణంగా తేల్చారు.

ఆ ప్రక్రియ ఎంత భారీగా సాగిందో తెలియజేసే ఉదంతం ఒకటి తాజాగా బయటకు వచ్చింది. తాను చెప్పినట్లుగా హిల్లరీకి ఓటు వేయకుండా ట్రంప్ కు ఓటు వేసిన భర్తకు విచిత్రమైన శిక్ష వేసిందో అమెరికన్ సతీమణి. తన అభిమతానికి వ్యతిరేకంగా ట్రంప్ కు ఓటు వేసిన భర్తపై చిర్రుబుర్రులాడుతున్న సదరు భార్యమణి.. ట్రంప్ కాస్తా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించేసరికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా పేర్కొన్నారు. తాజాగా బయటకు వచ్చిన ఈ సమాచారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

తన పేరు వెల్లడించటానికి ఇష్టపడని వ్యక్తి ఒకరి సమాచారంపై ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే.. ట్రంప్ కు ఓటేసిన భర్తకు 30 రోజుల పాటు తనను ముట్టుకోవద్దంటూ సదరు భార్యామణి కండీషన్ పెట్టటంతో సదరు భర్త విరహవేదనతో రగిలిపోతున్నాడట. తన అవస్థ గురించి బయటపెడుతూ.. ట్రంప్ కు ఓటేయటం తనకు పెద్ద తలనొప్పి వచ్చి పడిందని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. ట్రంప్ కు ఓటేసిన 6 కోట్ల మంది మగవాళ్ల ప్రస్తుత పరిస్థితి గుర్తు చేసుకుంటేనే తనకు బాధగా ఉందని కొందరు కొంటెగా సమాధానం ఇస్తున్నారు. ఏమైనా.. ట్రంప్ కు ఓటేసిన భర్తకు సదరు భార్యమణి విధించిన శిక్ష ఇప్పుడు అందరి నోటా నానుతోంది.
Tags:    

Similar News