మూత్రం పోశాడని బీజేపీ మంత్రిపై భార్య ఫిర్యాదు

Update: 2019-10-02 10:58 GMT
సంసారం సాగరం.. దాన్ని ఈదడం అంత తేలిక కాదంటారు.. ఏమాత్రం తేడా వచ్చిన అపురూపమైన భార్యలు కాస్తా ఆదిశక్తులవుతారు.. అల్పుడైన భర్త కాస్తా చండశాసనుడు అవుతాడు.. ఈ లొల్లిలు తట్టుకోలేకే కొందరు భార్యా బాధితులు మళ్లీ పెళ్లి చేసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. ప్రత్యక్ష నరకం చూసిన వారు అసలు పెళ్లే వద్దంటున్నారు. పోలీస్ స్టేషన్లలో ఇప్పుడు వచ్చే సగం వివాదాలు భార్యభర్తల మధ్యేనని ఓ సర్వే చెబుతోంది. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ స్వతంత్ర్యంగా బతకడం.. ఆధునిక జీవనం.. పుష్యలంగా డబ్బు, పరిపతి.. ఆదిపత్య ధోరణితో మాట అంటే పడకపోవడం ఇలా భార్యభర్తల మధ్య ప్రేమను దూరం చేసి వారిని విడదదీయడానికి చాలా కారణాలున్నాయి.

తాజాగా ఈ లొల్లి సగటు వ్యక్తులకే కాదు.. ఓ బీజేపీ మంత్రికి కూడా తాకింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న బాబూరామ్ నిషాద్ పై ఆయన భార్య సోషల్ మీడియాలో ఏకంగా ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఫిర్యాదు చేసింది. తన భర్త బాబూరామ్ తనపై మూత్రం పోస్తున్నాడంటూ ఆరోపించింది. ఈ మేరకు ఆమె ఫేస్ బుక్ లో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

14 ఏళ్ల క్రితం మంత్రి బాబురామ్ తో తనకు పెళ్లి అయ్యిందని.. అప్పటినుంచి నిత్రం నరకం చూపిస్తున్నాడని ఆయన భార్య సోషల్ మీడియాలో వాపోయింది. గన్ తో కాల్చి చంపేస్తానని బెదిరిస్తున్నాడని వివరించింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయింది.

అయితే తన భార్య మోడీ, యోగిలకు ఫిర్యాదు చేయడం.. మూత్రం పోస్తున్నానంటూ ఆరోపించడంపై మంత్రి బాబురామ్ నిషాద్ స్పందించారు. తన భార్య రోజూ అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తుందని.. తాను ఇవ్వని కారణంగానే ఇలా ఆరోపణలు చేస్తోందని వివరణ ఇచ్చారు. ఇప్పటికే ఆమె దుబారా ఖర్చులు తట్టుకోలేక తాను విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించానని.. డబ్బులు ఇవ్వనందుకే ఇలా చేస్తోందని.. ఆమె ఆరోపణలు అవాస్తవాలు అంటూ క్లారిటీ ఇచ్చారు.
Tags:    

Similar News