అమెరికా ద్వీపంలో ఎన్నారై దంపతులు మృతి

Update: 2019-09-05 15:04 GMT
ఓ ఎన్నారై కుటుంబం అమెరికాలో అసువులు బాసింది. ఉన్నత ఉపాధి కోసం అమెరికా వెళ్లిన దంపతులు వినోదం కోసం విహారానికి వెళ్లగా... ప్రాణాలు కోల్పోయారు. ఈ దంపతులతో పాటు మరో 32 మంది కూడా మరణించారు. వీరంతా ప్రయాణిస్తున్న ఓ పడవ అగ్నిప్రమాదానికి గురవడం వల్ల ఈ ఘోరం జరిగింది.

మహారాష్ట్రకు చెందిన పీడియాట్రిషియన్ సతీష్ పూజారి కుమార్తెలు ఇద్దరు అమెరికాలో నివసిస్తున్నారు. డెంటిస్ట్ అయిన ఓ అమ్మాయి - ఆమె భర్త కలిసి స్కూబా డైవింగ్ చేద్దామని సరదాగా కాలిఫోర్నియాలోని శాంటా క్రజ్ ద్వీపానికి వెళ్లారు. ఈ పడవలో మొత్తం 33 మంది ప్రయాణికులు - ఆరుగురు డైవర్స్ ఉన్నారు. అయితే, అగ్నిప్రమాదం వల్ల... ఈత వచ్చిన వారు కూడా ప్రాణాలు కాపాడుకోలేకపోయారు. ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే అధికారులు సహాయ చర్యలు చేపట్టినా... క్షణాల్లో అంతా జరిగిపోవడంతో వారు నిస్సహాయులైపోయారు.

మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ఇంకా అన్ని మృతదేహాలు గుర్తించలేదు. ఇందులో పలు దేశాల వారు ఉన్నారు. అత్యంత శోచనీయమైన విషయం ఏంటంటో... ముగ్గురు కూతుర్లతో కలిపి తల్లిదండ్రులు ఇద్దరు ఉన్న మరో కుటుంబం కూడా ఈ ప్రమాదం బారినపడింది. బయటకు తీసిన మృతదేహాలు ఏది ఎవరిది అని గుర్తుపట్టడానికి డీఎన్ ఏ పరీక్షలు చేస్తున్నారు.

ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మహారాష్ట్రకు చెందిన సతీష్ రెండో కూతురు అక్కడికి చేరుకున్నారు. సోదరి - బావల మృతదేహాలు కూడా గుర్తుపట్టలేక ఆమె తీవ్ర శోకంతో తల్లిడిల్లిపోయారు. ఇక్కడ వారి తల్లిదండ్రుల  శోకాన్ని ఎవరూ ఆపలేకపోతున్నారు. వినోదం కోసం వెళ్తే ప్రాణాలే తీశావా దేవుడా అంటూ అమ్మాయి తల్లిదండ్రులు రోదిస్తున్నారు.  


Tags:    

Similar News