లాక్ డౌన్ ను ఉల్లంఘించిన భర్త..కేసు పెట్టిన భార్య..ఎందుకంటే!

Update: 2020-04-08 01:30 GMT
కరోనా వైరస్ దేశం వ్యాప్తంగా తన ప్రభావం చూపిస్తుంది. కరోనా వైరస్ విస్తరించకుండా ప్రభుత్వం అమలు చేస్తోన్న లాక్‌ డౌన్‌ కొంతమేర సత్ఫలితాలను ఇస్తున్న కూడా, లాక్ డౌన్ నిబంధనలను పట్టించుకోకుండా కొందరు బయట తిరుగుతున్నారు. అలాంటివారికీ భార్యలే బుద్ధి చెప్తున్న ఘటనలు కొన్ని చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి కేరళ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ... కేరళ రాష్ట్రంలో ఎర్నాకులం జిల్లాలోని మువత్తుప్పుజాలో నివసిస్తున్న ఒక మహిళ భర్తపై ఫిర్యాదు చేసింది. లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా బయట తిరుగుతున్నాడని ఫిర్యాదు చేసింది. తన భర్త బైక్ నంబర్ తో సహా ఫిర్యాదులో పేర్కొంది. ఏదో సరదాకి భర్తపై ఫిర్యాదు చేసింది అనుకుంటారేమో కానీ, ఆమె చాలా సీరియస్ గా తన భర్తపై కేసు నమోదు చేసి తగిన శిక్ష వేయాలని తెలిపింది. అయితే, భర్తకు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించాలని భావించిన పోలీసులు... ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని కోరారు. కానీ ఆమె దానికి ఒప్పుకోలేదు.

లాక్‌ డౌన్‌ ను లెక్కచేయకుండా బైక్‌ వేసుకుని తిరిగేస్తున్న తన భర్త వల్ల తన కుటుంబానికి ,పిల్లలకు , తనకు ఏం హాని జరుగుతుందో అని భయపడుతుంది. పలు మార్లు భర్తకు నచ్చజెప్పినా ఆయన వినకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ మహిళా చెప్తుంది. ఎంతచెప్పినా వినకుండా బయట తిరిగే వ్యక్తి, ఎక్కడ వైరస్ అంటించుకుంటాడో తెలియదు. ఆయనతో మా కుటుంబానికి కూడా ప్రమాదమే అని ఆ మహిళా అంటోంది.
Tags:    

Similar News