పెళ్లి చేసుకుంది. భర్త సొమ్ముతో పరారయ్యింది...!

Update: 2021-12-21 08:23 GMT
వినడానికి వింతగా ఉన్న ఇది నిజంగా జరిగిన సంఘటనే. ఎన్నో ఏళ్లుగా తనకు పెళ్లి కావట్లేదనుకున్న ఓ అబ్బాయికి లేక లేక పెళ్లి చేసుకునేందకు ఓ అమ్మాయి దొరికింది. దీంతో ఆమెను తన దేవతలా చూసుకున్నాడు. అన్నీ కొన్నిచ్చాడు. అప్పటికే బాగా సంపాదించిన తన ఇంట్లోకి తీసుకెళ్లాడు.

అయితే బయటకు వెళ్లొస్తానని అతడు వెళ్లడంతో ఇదే అదనుగా చూసిన కొత్త పెళ్లి కూతురు తనకు కొనిచ్చిన బంగారంతో పాటు ఇంట్లో ఉన్న సామానంతా దోచుకొని ఉడాయించింది. ఇంటికొచ్చిన పెళ్లికొడుకుకు తాను పెళ్లి చేసుకున్న అమ్మాయితోపాటు సొమ్మంతా మాయం కావడంతో లబోదిబోమంటున్నాడు.

హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడికి 40 ఏళ్లు వచ్చినా పెళ్లి కావడం లేదు. దీంతో తాను పెళ్లి కోసం అనేక ప్రయత్నాలు చేశాడు. చివరికి తనకు ఓపెళ్లిళ్ల పేరయ్య పరిచయం అయ్యాడు. తనకు లక్ష రూపాయల డబ్బుఇస్తే మంచి అమ్మాయిని చూపిస్తానన్నాడు. దీంతో పేరయ్యకు లక్ష ముట్టగానే విజయవాడకు చెందిన ఓ అమ్మాయిని చూపించాడు.

అప్పటికే పెళ్లి కోసం ఎదురుచూస్తున్న ఆ యువకుడికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే అమ్మాయికి ఎవరూ లేరని పేరయ్య తెలిపాడు. కానీ మరో అమ్మాయి తన స్నేహితురాలని పరిచయం చేసుకుంది.

దీంతో ఇద్దరు కలిసి విజయవాడ లాడ్జిలోనే పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత యాదగిరి గుట్టకు వెళ్లి పూజలు చేశారు. ఆ తరువాత పెళ్లి కొడుకు హైదరాబాద్లోని తన ఇంటికి అమ్మాయిని తీసుకెళ్లాడు. ఎంతో ఇష్టపడి చేసుకున్న అమ్మాయికి 3 తులాల బంగారం, 40 వేల రూపాయల దుస్తులు కొనిచ్చాడు. ఇద్దరూ కలిసి షాపింగ్ చేసి రాత్రి ఇంటికి వచ్చారు. అయితే పెళ్లి కూతురు తనకు తలనొప్పిగా ఉందని, టాబ్లెట్ తెమ్మని కోరింది. దీంతో అతడు టాబ్లెట్ కోసం బయటికి వెల్లాడు.

భర్త బయటకెళ్లిన సమయం చూసి దుస్తులు, నగలు, మరో 2 లక్షల రూపాయలతో పరారయింది. ఆమెతో పాటు స్నేహితురాలు అని పరిచయం చేసుకున్న అమ్మాయి అప్పటికే క్యాబ్ తో రెడీగా ఉంది. ఇద్దరూ కలిసి కారులోనే దుస్తులు మార్చుకొని ఆ తరువాత విజయవాడకు వెళ్లారు. అయితే ఇంటికొచ్చేసరికి పెళ్లికొడుకు తన భార్య కోసం వెతికాడు. ఆ తరువాత డబ్బు, నగలు, దుస్తులు కనిపించకపోయేసరికి ఆమె దొంగతనం చేసిందని భావించాడు.


Tags:    

Similar News