చావుబతుకుల మధ్య భర్త.. వీర్యం కావాలంటున్న భార్య

Update: 2021-07-22 04:20 GMT
కరోనా కల్లోలం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. ఎంతో మందిని అనాథలను చేసింది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఎంతోమంది అష్టకష్టాలు పడుతున్నారు. కుటుంబాలకు కుటుంబాలే తుడిచిపెట్టుకుపోయిన ధైన్యం సెకండ్ వేవ్ లో కనిపించింది. ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు.  కరోనా మిగిల్చిన విషాధ గాథలు వింటే కన్నీళ్లు ఆగవు.

తాజాగా మరో విషాధ కథ అందరినీ కదిలించేలా ఉంది. పెళ్లై ఏడాది కాకముందే ఓ మహిళ కరోనా కారణంగా తన భర్తను కోల్పోయింది.  భర్త కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతుంటే ఆమె తన భర్త వీర్యం కావాలంటూ కోర్టును ఆశ్రయించడం సంచలనమైంది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

గుజరాత్ లోని వడోదరకు చెందిన ఓ మహిళకు ఏడాది క్రితం వివాహమైంది. ఇటీవల ఆ మహిళ బర్త కరోనా బారినపడి వడోదరలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.బతకడం కష్టమని అన్నారు. ఆయన అవయవాలన్నీ దెబ్బతిన్నాయని డాక్టర్లు స్పష్టం చేశారు.

అయితే తమ బంధం, ప్రేమ, అన్యోన్యతకు గుర్తు ఉంచుకోవాలని.. బిడ్డ రూపంలో కాపాడుకోవాలని ఆ మహిళ సంకల్పించింది. తన భర్త నుంచి సేకరించిన వీర్యంతో ఐవీఎఫ్ పద్ధతిలో తాను తల్లి కావాలని భావించింది. ఆయనతో ప్రేమను తీపిగురుతులను బిడ్డలో చూసుకోవాలనుకుంది. తమ ప్రేమకు ప్రతిరూపం కావాలనుకుంది.

కానీ కరోనా బాధితుడి నుంచి వీర్యం సేకరించేందుకే ఆస్పత్రి వర్గాలు అనుమతి నిరాకరించాయి. కోర్టు ఆదేశిస్తే చేస్తామని తెలిపాయి. దీంతో మహిళ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది.  కోర్టు కూడా ఆ మహిళ విజ్ఞప్తికి వెంటనే ఆమోదించింది. ఆ రోగి నుంచి వెంటనే వీర్యం సేకరించి భద్రపరచాలని సూచించింది. ఐవీఎప్ ద్వారా గర్భం దాల్చేందుకు అతడి భార్యకు సహకారం అందించాలని ఆస్పత్రికి సూచించింది.

ఇలా భర్త చనిపోయినా తన పిల్లల రూపంలో ఆయన జ్ఞాపకాలను బతికించుకోవాలని ఆయన భార్య చేసిన పోరాటానికి నిజంగానే ప్రశంసలు కురుస్తున్నాయి.
Tags:    

Similar News