ట్రంప్‌పై విచారణ జరిపితే అమెరికా అల్లకల్లోలమేనట?

Update: 2022-08-30 07:25 GMT
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల వేళ ఎంతటి విద్వేష పూరిత వ్యాఖ్యలు చేశారు.? ఓడిపోతుంటే ఎలా తన మద్దతుదారులతో అమెరికన్ కాంగ్రెస్ పై దాడి చేయించారో అందరం చూశాం. చరిత్రలోనే ఇదో మాయని మచ్చలా మారింది. ఇప్పుడు వాటిపై ట్రంప్ ను విచారిస్తే మరోసారి అమెరికా అల్లర్లతో అట్టుడకడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.  రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం తాజాగా ఈ హెచ్చరికలు చేశారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై నేరారోపణ చేస్తే "వీధుల్లో అల్లర్లు చెలరేగుతాయని"  హెచ్చరికలు పంపారు..

"మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి ప్రయత్నించినట్లయితే, అమెరికా వీధుల్లో అక్షరాలా అల్లర్లు జరుగుతాయి" అని దక్షిణ కెరొలిన రిపబ్లికన్ సోమవారం ఫాక్స్ న్యూస్‌లో చెప్పడం సంచలనమైంది. దేశం గురించి ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయని హెచ్చరించారు.  ట్రంప్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలు పెరుగుతున్నప్పటికీ మాజీ అధ్యక్షుడిని టచ్ చేయడానికి ప్రభుత్వం వెనుకాడుతోంది. చాలా మంది రిపబ్లికన్‌లు దీనిపై పోరాడడానికి రెడీ కావడమే కారణం.

"నాతో సహా చాలా మంది రిపబ్లికన్లు  ట్రంప్ కోసం పోరాడడానికి రెడీగా ఉన్నారు" అని గ్రాహం అన్నారు. జనవరి 6,2021న క్యాపిటల్‌పై దాడి చేసిన తర్వాత చాలా మంది అగ్రశ్రేణి రిపబ్లికన్‌ల మాదిరిగానే గ్రాహం కూడా ట్రంప్‌తో క్లుప్తంగా విడిపోయారు. కానీ వారాల వ్యవధిలో ట్రంప్ యొక్క దుశ్చర్యలకు గ్రాహం సాకులు చెబుతూ తాజాగా సమర్థించడం సంచలనమైంది.  

అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్‌తో 2020లో జరిగిన ఓటమిని తిప్పికొట్టడానికి రాష్ట్ర అధికారులను  ట్రంప్ బెదిరించారని.. దీని గురించి జార్జియా గ్రాండ్ జ్యూరీ ముందు సాక్ష్యం చెప్పేవారికి వ్యతిరేకంగా గ్రాహం పోరాడుతున్నాడు.ట్రంప్ కు శిక్ష పడితే దేశం అల్లకల్లోలం అవుతుందని హెచ్చరిస్తున్నారు.

ట్రంప్‌ను గ్రాహం సమర్థించడం కొనసాగిస్తున్నారు.  ప్రాసిక్యూటర్లు ట్రంప్ మార్-ఎ-లాగో రిసార్ట్‌లో దాచిన అత్యంత రహస్య పత్రాల పెట్టెలను కనుగొన్నారు. అందులోంచి సాక్ష్యాలను సంపాదించాలని ప్రయత్నిస్తున్నారు.  ట్రంప్ పదవీ విరమణ సమయంలో పత్రాలను సరిగ్గా తీసుకోలేదని తెలిసింది.  దీనిపై ఎఫ్‌బిఐ విచారణ జరుపుతోంది.

కొంతమంది రిపబ్లికన్‌ల మాదిరిగానే గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘించినందుకు.. న్యాయానికి ఆటంకం కలిగించే అవకాశం ఉన్నందుకు ట్రంప్‌ను విచారించాలని కొందరు కోర్టులను ఆశ్రయించారు. హిల్లరీ క్లింటన్ కూడా ట్రంప్ కు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.  న్యాయ శాఖ మాజీ విదేశాంగ కార్యదర్శిని కూడా ఈ విషయంలో విచారించింది. హిల్లరీ మాత్రం తనపై విచారణకు నిరాకరించింది. ఇప్పుడు ట్రంప్ ను విచారిస్తే అమెరికా అల్లకల్లోలంగా మారడం ఖాయమని రిపబ్లికన్లు హెచ్చరిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News