అవును.. ఏపీలో ముందస్తు ముచ్చట తేలిపోతుందా? అసలు ఎన్నికలు వుంటాయో.. ఉండవో కూడా స్పష్ట మై పోతుందా? అనేది ఆసక్తిగా మారింది. దీనికి కారణం.. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనే. ఇప్పుడు సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ పర్యటన వెనుక చాలానే విశేషాలు ఉన్నాయని తాడేపల్లి వర్గాల నుంచి సమాచా రం వస్తోంది. ఒకటి.. అప్పుల కోసం జగన్ ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారని అంటున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో సామాజిక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తోంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున అప్పులు చేస్తోంది. అదేసమయంలో ఎంత అప్పులు చేసినా.. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు.. పింఛన్లు ఇచ్చేందుకు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. రాను రాను ఈ భారం పెరిగిపోతోంది. మరో వైపు అప్పులు పుట్టే పరిస్థితి కూడా కనిపించడం లేదు.
ఈ క్రమంలో వచ్చే జనవరి నుంచి పింఛన్లను పెంచడంతో మరింతగా నిధుల అవసరం ఉంది. దీని నుం చి గట్టెక్కేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరిన్ని అప్పులు చేసుకునేందుకు అవకాశం కల్పిం చా లని సీఎం జగన్ మోడీని స్వయంగా అభ్యర్థించేందుకు ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీలో కనుక సానుకూల పరి ణామాలు వస్తే.. ఖచ్చితంగా జగన్ వచ్చే పూర్తికాలం అధికారంలో కొనసాగే అవకాశం ఉంది.
ఒకవేళ.. కేంద్రం కనుక అప్పులు మరిన్ని చేసుకునేందుకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేసిన ప క్షంలో జగన్.. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని రద్దు చేసుకునే దిశగా ఆలోచన చేస్తారని అంటున్నారు. ఎందుకంటే.. సంక్షేమ పథకాలు ఆగిపోయే వరకు కాకుండా..
అమలు దశలో ఉండగానే.. సర్కారును రద్దు చేసుకుంటే.. దీపం ఉండగానే అన్నట్టుగా.. ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇదే వ్యూహంతో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన చేస్తున్నారని ఒక టాక్ నడుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.