తెలంగాణలో విభిన్న రాజకీయం నడుస్తోంది. రాష్ట్రంలో కయ్యాలు కేంద్రంలో వియ్యాలు అన్న విధంగా ఎప్పటి నుంచో రాజకీయం నడుస్తుంది. పె ట్టుబడుల ఆకర్షణల్లో విదేశీ మంత్రిత్వ శాఖ సాయం ఉంటూనే ఉంటుంది. అదేవిధంగా ముఖ్యమయిన పథకాల అమలులో కేంద్రం సాయం ఉంటూనే ఉంటుంది. ఆఖరికి తెలంగాణ భవన్ ను ఢిల్లీ కేంద్రంగా నిర్మించుకోవాలన్నా కేంద్రం సాయం అందుతూనే ఉంటుంది. అయినా కూడా కేటీఆర్ తెరపైకి వచ్చి తిడుతుంటారు బీజేపీని ! అదే కదా పెద్ద కామెడీ అంటే !
ఇక్కడ ఓడిపోతున్నదెవరు ప్రజలు కదా ! గెలుపు సాధిస్తున్నదెవరు నాయకులు కదా! ఇదే ఇవాళ్టి రాజకీయం అని అంటున్నారు పరిశీలకులు. ఇదిగో నాస్కామ్ ఓ వరం. అదిపుడు వరంగల్ కు ఇచ్చింది. దేశంలోనే ద్వితీయ శ్రేణీ నగరాల్లో ఐటీ రంగానికి సంబంధించి వరంగల్ జిల్లానే మేలు అని తేల్చింది. మరి ! ఈ ఘనత వెనుక ఉన్నది కూడా కేసీఆర్ ఒక్కరేనా లేదా కేంద్రం ఆదుకోకుండానే జరిగిపోతున్నాయా అన్నది బీజేపీ ప్రశ్న.
కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉండడంతో పాటు ఇక్కడి మౌలిక వసతుల కల్పన కూడా ఎంతో బాగుందని విఖ్యాత నాస్కామ్ తేల్చేసింది. ఇక్కడికి టెక్ మహేంద్ర, సైయెంట్ లాంటి దిగ్గజ సంస్థల రాక వెనుక కేంద్రం ప్రమేయం ఏమీ లేదంటారా అని కూడా ప్రశ్నిస్తోంది బీజేపీ.
అంటే అభివృద్ధి జరిగితే అదంతా తమ ఖాతాలో వేసుకోవడం లేదంటే ఏ చిన్న తప్పు జరిగినా అది కేంద్రం ఖాతాలో చూపడం అన్నవి ఇటీవల కేసీఆర్ వర్గాలకే చేతనవుతున్న పనులు అని మండిపడుతోంది బీజేపీ.
ఏదేమయినప్పటికీ ఏ ప్రాంతం అభివృద్ధి అయినా, ఏ రాష్ట్రం అమలు చేసే సంక్షేమం అయినా అందులో కేంద్రం వాటా అన్నది లేకుండా పోదు అని, వాటిని అర్థం చేసుకుని ప్రజలకు వివరిస్తే బాగుంటుందని కేంద్రం తరఫున టీబీజేపీ పెద్దలు కేసీఆర్-కు హితవు చెబుతున్నారు. దావోస్ మీటింగ్ తరువాత తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయంటే అందులో కేంద్రం చొరవ కూడా ఉందన్నది అని కూడా చెబుతున్నారు.
ఇంకోవైపు ఏపీలో మాత్రం బీజేపీకి భేషరుతుగా మద్దతు పలుకుతున్న జగన్ కి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బీజేపీ అక్కడ మంటపెడుతూ ఉంది. మరి దీనికి కారణమేంటో మరి.