కరోనాకు బీజేపీ ఎంపీ బలి.. వ్యాక్సిన్ వచ్చాక మరణించటమా?

Update: 2021-03-02 05:30 GMT
వణుకు పుట్టించిన కరోనాకు టీకా వచ్చేసింది. మరేం ఫర్లేదన్న అతి ధీమా ప్రాణాలు తీసే వరకు వెళుతుందన్న విషయం ఇప్పడిప్పుడే అందరికి అర్థమవుతుంది. వ్యాక్సిన్ వచ్చేసి నలభై రోజులు దాటటమే కాదు.. రెండో దశ కూడా మొదలైన ఇప్పటి పరిస్థితుల్లో కరోనాబారిన పడి మరణించటం అన్నింటికిమించిన విషాదం. అందునా.. అలా మరణించిన వ్యక్తి ఎంపీ కావటం షాకింగ్ గా మారింది.

కరోనా కారణంగా ఇప్పటికే ఎంతోమందిని పోగొట్టుకున్నాం. సామాన్యయులు.. ప్రముఖులు అన్న తేడా లేకుండా ప్రాణాలు తీసేసినఈ మహమ్మారి కారణంగా బీజేపీకి చెందిన ఎంపీ ఒకరు మరణించారు. మధ్యప్రదేశ్ ఖంద్వా నియోజకవర్గ ఎంపీ నందకుమార్ సింగ్ చౌహాన్ తాజాగా కరోనా చికిత్స పొందుతూ మరణించారు. ఇటీవల శ్వాస సంబంధిత సమస్య రావటంతో ఆయన ఆసుపత్రిలో చేరారు.గడిచిన పదిహేను రోజులుగా ఢిల్లీలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ సమాచారంతో బీజేపీ వర్గాలు ఢీలా పడ్డాయి. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకొని వేదన చెందుతున్నారు.

ఇదిలా ఉంటే.. టీకా వచ్చిన తర్వాత కూడా ఎంపీ స్థాయి వ్యక్తి కరోనాకు బలి కావటం షాకింగ్ గా మారింది. తాజా విషాద ఉదంతం చూస్తే.. దేశంలో టీకా పంపిణీని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం తాజా ఉదంతం చెప్పిందని చెప్పాలి. నలభై రోజులుగా టీకా అందుబాటులోకి వచ్చాక కూడా ఎంపీ స్థాయి నేత కరోనా బారిన పడి చనిపోవటం దేనికి నిదర్శనం? అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న.


Tags:    

Similar News