కర్ణాటకలో కాంగ్రెస్ – జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ అడుగులు వేసింది. నేడో - రేపో కర్ణాటక కొత్త సీఎంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్డూరప్ప ప్రమాణం చేయనున్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే.. రాష్ట్రంలో చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. కేబినెట్ ఏర్పాటు ప్రధాన సమస్యగా మారింది. మంత్రివర్గంలో చోటు లభించలేదనే కారణంతో కాంగ్రెస్ – జేడీఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. ఇదే బాటలో బీజేపీలో కూడా కేబినెట్ లేనిపోని తంటాలు తెస్తుందని భావిస్తున్నారు. దీనికి తోడు బల నిరూపణ ఓ వైపు.. రాజీనామాల విషయంలో తుది నిర్ణయం ఏంటనేది మరో వైపు బీజేపీని వెంటాడుతున్నాయి. అసంతృప్త ఎమ్మెల్యేలు రాజీనామా ఉపసంహరించుకుంటే బీజేపీ కష్టాల్లోకి పడుతుంది. అలా కాదని.. రాజీనామా ఆమోదించి.. పార్టీ మారితే ఉప ఎన్నికలు వస్తే బీజేపీకి లాభం ఉంటుంది.
బీజేపీ నేతృత్వంలో కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మంత్రివర్గం - డిప్యూటీ సీఎం పదవి ఎవరికి ఇవ్వాలనేది ఢిల్లీలోని బీజేపీ పెద్దలే నిర్ణయిస్తారని తెలిసింది. సంకీర్ణ ప్రభుత్వం పతనం విషయంలో కూడా ఢిల్లీ పెద్దల డైరెక్షన్ లోనే స్థానిక బీజేపీ నాయకులు నడిచినట్లు స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ – జేడీఎస్ మధ్య తగాదా పెట్టి.. ప్రజల్లో వ్యతిరేకతా భావాలు తీసుకురావడంతో బీజేపీ నాయకులు విజయం సాధించారు. అలాగే డిప్యూటీ సీఎం రేసులో పలువురు సీనియర్ నాయకులు రేసులో ఉన్నారు. దీనికి తోడు కాంగ్రెస్ – జేడీఎస్ నుంచి రాజీనామా చేసిన అసంతృప్త ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరి కేబినెట్ బెర్తు ఆశిస్తున్నట్లు తెలిసింది. డిప్యూటీ సీఎం రేసులో అరవింద లింబావళి - ఆర్.అశోక్ - కేఎస్ ఈశ్వరప్ప - బి.శ్రీరాములు పేర్లు వినిపిస్తున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి రమేశ్ జార్కిహోళి, జేడీఎస్ నుంచి హెచ్.విశ్వనాథ్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకుంటే ఉపముఖ్యమంత్రి స్థానంపై కన్నేసినట్లు సమాచారం.
సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ – జేడీఎస్ ఎమ్మెల్యేలు 15 మంది రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే రాజీనామాలపై ఏదో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ వారు రాజీనామా ఉపసంహరించుకుంటే బీజేపీ బలం తగ్గిపోతుంది. ఫలితంగా బల నిరూపణ అంత సులువు కాదు. అసంతృప్త ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకునే ఆలోచన ఉంటే రాజీనామా ఆమోదించాలని ఒత్తిడి తేవచ్చు. ఈక్రమంలో 15 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయి. అందులో అన్ని సీట్లలో కాంగ్రెస్ – జేడీఎస్ గెలవడం అసాధ్యం. ఫలితంగా బీజేపీ లాభపడుతుంది. అయితే వారిలో ఎవరికి మంత్రిమండలిలో చోటు ఇవ్వాలనే దానిపై బీజేపీ పెద్దలు సతమతం అవుతున్నారు. మరోవైపు సొంత పార్టీలో ఉన్న సీనియర్ నేతలే మంత్రి పదవి కోసం ఎవరికి వారు లాబీయింగ్ చేస్తున్నారు.