తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ నుంచి మరో వికెట్ పడే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ సీనియర్ నేత బొడ్డు భాస్కర రామారావు త్వరలోనే వైసీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ఇప్పటికే మెజారిటీ సీట్లు కోల్పోయిన తెలుగుదేశం పార్టీకి తూర్పు గోదావరి జిల్లాలో భారీ షాక్ తగిలినట్లే.. బొడ్డు భాస్కర రామారావు కాకలుతీరిన రాజకీయ నాయకుడు. జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత. ఆర్థిక పరిపుష్టి, అంగబలం పుష్కలంగా ఉన్నాయి.
గత ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఆయన పోటీ చేయకపోయినా, సొంత నియోజకవర్గం పెద్దాపురంతో పాటు మరో నాలుగైదు నియోజక వర్గాల్లో వైసీపీ గెలుపునకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించారు. బొడ్డు భాస్కర రామారావు, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఒక పర్యాయం ఎమ్మెల్సీగా, మూడు పర్యాయాలు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా, విప్ గా, ఓ సారి తూర్పు జెడ్పీ చైర్మన్ గా పదవులు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీలో చురుగ్గా వ్యవహరించడంతో రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా పదవులు చేపట్టారు.
అయితే కొంతకాలంగా వైసీపీకి దగ్గర ఉంటున్న భాస్కర్ రావుకు గత ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి టికెట్ రాలేదు. ఇంతకు బొడ్డు భాస్కర రామారావు టీడీపీలో ఉన్నారా లేక వైసీపీలో చేరారా ? తేల్చుకోలేక ఆయన అనుచరులు తికమక పడుతన్నారు. అయితే ఈ అనుమా నాలకు ఫుల్ స్టాప్ పెడుతూ రేపోమాపో భాస్కర్ రావు వైసీపీలో చేరుతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పెద్దాపురం నియోజకవర్గం తన సొంత ఇలాకాలా భావిస్తుంటారు బొడ్డు. తెలుగుదేశంలో తనను కాదని ఎక్కడో కోనసీమలో ఉన్న నిమ్మకాయల చినరాజప్పను తీసుకొచ్చి టిక్కెట్ ఇచ్చారని ఇప్పటికీ రగిలిపోతుంటారు బొడ్డు భాస్కర రామారావు.
ఓసారి పార్టీ మోసగించిందని, ఇక మోసపోనని రాజప్ప ఓటమే తన ధ్యేయంగా ప్రకటించారు. అందుకే గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తోట వాణి గెలుపుకోసం లోలోపల భారీ కసరత్తే చేశారు. తన క్యాడర్ ను అంతా మళ్ళించి చక్రం తిప్పారు. అయినా బొడ్డు వ్యూహం ఫలించలేదు. వైసీపీ అధినేత తనకు టిక్కెట్ ఇచ్చి ఉంటే రాజప్ప పని అంతేనని ఆయన అనుచరులు పదేపదే వ్యాఖ్యానించారు. పెద్దాపురం ఎమ్మెల్యేగా రాజప్ప గెలిచారు. ఇక అక్కడ వైసిపి ఇన్చార్జిగా బొడ్డుని నియమిస్తే, పార్టీ మెట్ట ప్రాంతంలో మరింత బలపడవచ్చన్న వాదనలు మొదలయ్యాయి.
ఆర్థిక పరిపుష్టి, అంగబలం ఉన్న బొడ్డు, మధ్యలో కొంతకాలం వైసీపీతో అంటకాగారు. తనయుడు వెంకటరమణ చౌదరిని రాజమహేంద్రవరం ఎంపీగా గతంలో నిలబెట్టిన బొడ్డు ఆ తర్వాత టీడీపీలోకి వచ్చినా ఆయన్ను బాబు పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు తిరిగి వైసీపీలోకి వెళ్లేందుకు మొగ్గు చూ పుతున్నట్లు తెలుస్తోంది. తనను ఓడించాలని బొడ్డు ప్రయత్నిస్తున్నట్లు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పార్టీ అధిష్టానవర్గానికి అప్పటి హోం మంత్రి చినరాజప్ప ఫిర్యాదు చేసి రచ్చ చేశారు. అయినా అధిష్టానం మౌనంగా ఉండిపోయింది. ఇప్పటికీ అధికారికంగా టీడీపీలోనే... అనధికారికంగా వైసీపీలో ఉన్న బొడ్డు ఇక అధికారికంగా వైసీపీలో చేరడం ఖాయమైందన్న చర్చ జరుగుతోంది. అయితే బొడ్డు భాస్కర రామారావు వంటి నేతలను కూడా కోల్పోతే, టీడీపీకి జిల్లాలో మరో భారీ షాక్ తప్పదు.