ప్రపంచంలో చాలామంది ప్రముఖులు ఉంటారు. అలాంటి వారిలో చాలామందికి వారి పేరు చెప్పినంతనే వెంటనే గుర్తుకు వస్తారు. కానీ.. కొందరుంటారు. వారి పేర్లే పెద్ద బ్రాండ్ లుగా చలమణీ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో ఒకరు ఇంద్రానూయి. ఆమె పేరు విన్నంతనే పెప్సీకో బ్రాండ్ వెంటనే గుర్తుకు వస్తుంటారు. సుదీర్ఘ కాలం పెప్సీకోకు ఛైర్మన్ గా వ్యవహరించిన ఆమె.. ఈ మధ్యనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ఆమె ప్రకటించారు.
ఇదిలాఉంటే.. తాజాగా ఆమెను ఏషియా సొసైటీ ఫౌండేషన్ ప్రకటించిన గేమ్ చేంజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పలువురు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. అన్నింటికి మించి మీరు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందన్న ప్రశ్నకు ఆమె ఊహించని రీతిలో రియాక్ట్ అయ్యారు.
తనకు రాజకీయాలు ఏ మాత్రం వంటబట్టదని.. తియ్యగా మాట్లాడటం తనకు రాదన్నారు. ఆ మాటకు వస్తే తనకు సరిగా మాట్లాడటమే రాదన్న ఇంద్రనూయి.. తాను కానీ రాజకీయాల్లోకి వస్తే.. మూడో ప్రపంచ యుద్ధం ఖాయమన్నారు. ఒకవేళ తాను కానీ రాజకీయాల్లోకి వస్తే..తన మాటల కారణంగా మూడో ప్రపంచ యుద్దం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఆమె అక్టోబరు 3న తాను పెప్సీకో బాధ్యతల నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించారు.
పెప్సీలో తన ప్రయాణం గురించి వివరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాదాపుగా నలభై ఏళ్లుగా తాను ఉదయం నాలుగు గంటల నుంచి అర్థరాత్రి వరకూ పని చేసేదానినని.. రోజుకు 18 నుంచి 20 గంటలు పని ఉండేదని.. నాలుగు గంటలకు మించి నిద్రపోయింది లేదన్నారు. తనకు నిద్ర పోవటం ఇష్టమని.. ఇకపై తాను రోజుకు ఆరేడు గంటలు ఏకధాటిగా నిద్ర పోవటం నేర్చుకోవాలన్న ఆమె.. రానున్న రోజుల్లో వీలైనన్ని దేశాలు చుట్టి రావాలని భావిస్తున్నట్లు చెప్పారు. అనుకుంటాం కానీ అత్యున్నత స్థానాల్లో ఉన్న వారికి నాన్ స్టాప్ గా ఆరు గంటల పాటు నిద్ర పోవటం కూడా అపురూపమన్న విషయాన్ని చూస్తే.. సాదాసీదా జీవితం ఎంత ప్రశాంతమన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు.