సారు సంచలన నిర్ణయం.. 50వేల మందికి నిర్దారణ పరీక్షలకు ఓకే

Update: 2020-06-15 05:00 GMT
ఎవరు ఎన్ని చెప్పినా.. చుట్టుపక్కల రాష్ట్రాల్లో చేపట్టిన విధానాల్ని వదిలేసి.. తనదైన మార్గంలో నడిచిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్టకేలకు తన మైండ్ సెట్ ను కాస్త మార్చుకున్నారు. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో నిర్దారణ పరీక్షలు ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిదిన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. దీనికి భిన్నంగా ఎంతో అవసరమైతే తప్పించి నిర్దారణ పరీక్షలు నిర్వహించకూడదన్నట్లుగా తెలంగాణ ప్రభుత్వ అధికారులు వ్యవహరించారు. ఇంత ఆచితూచి అన్నట్లు పరీక్షలు నిర్వహించటం వెనుక లాజిక్ ఏమైనా ఉందా? అంటే అదేమీ లేదంటున్నారు. కానీ.. నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నది మాత్రం లేదు.

ఇదిలా ఉంటే.. మరోవైపు హైదరాబాద్ లో పాజిటివ్ కేసులు అంతకంతకూ విస్తరించుకుంటూ పోతోంది. దీనికి చెక్ పెట్టటంతో పాటు.. రానున్న రోజుల్లో నిర్దారణ పరీక్షల్నిపెద్ద ఎత్తున పెంచనున్నట్లుగా తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్ ను కాపాడుకోవాలన్న ముందుచూపుతో యాభై వేల మందికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలన్నారు. పెద్ద వయస్కులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లోనే ఉండాలన్న ఆయన.. తీవ్ర జబ్బులు ఉన్న వారు తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు.

తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం హైదరాబాద్.. దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో నిర్దారణ పరీక్షల్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నారు. 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో యాభై వేల మందికి టెస్టుల్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వ ఆసుపత్రుల్నే కాదు.. ప్రైవేటు ఆసుపత్రుల్ని కూడా వినియోగించుకోవాలని కేసీఆర్ స్పష్టం చేశారు. అంతేకాదు.. నిబంధనలకు తగినట్లుగా వ్యాధి నిర్దారణ పరీక్షలకు సైతం ఓకే చెప్పేందుకు సారు సిద్ధమయ్యారు. అంతేకాదు.. చికిత్సకు అవసరమైన మార్గదర్శకాలు.. ధరల్ని నిర్ణయించాలని కోరారు.

ఇంతకీ ఈ పరీక్షల్ని ఎప్పుడు నిర్వహిస్తారన్న సందేహం కలిగిందా? అక్కడికే వస్తున్నాం. రానున్న వారం పది రోజుల్లో యాభై వేల నిర్దారణ పరీక్షల్ని నిర్వహిస్తారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
యాభై వేల నిర్దారణ పరీక్షలు నిర్వహించే అసెంబ్లీ నియోజకవర్గాలు ఏమేమి అన్నవి చూస్తే..
-  ఉప్పల్
-  ఎల్బీ నగర్
-  మహేశ్వరం
- ఇబ్రహింపట్నం
-  రాజేంద్రనగర్
-  శేరిలింగంపల్లి
-  పటాన్ చెర్వు
-  చేవెళ్ల
-  పరిగి
-  వికారాబాద్
-  తాండూర్
-  మేడ్చల్
-  మల్కాజ్ గిరి
-  కుత్భుల్లాపూర్
-  కూకట్ పల్లి
-  జూబ్లీహిల్స్
- సనత్ నగర్
-  నాంపల్లి
-  కార్వాన్
-  గోషామహల్
-  చార్మినార్
-  చాంద్రాయణ గుట్ట
-  యాకుత్ పుర
-  బహదూర్ పుర
-  మలక్ పేట
-  అంబర్ పేట
-  ముషీరాబాద్
-  ఖైరతాబాద్
-  సికింద్రాబాద్
-  సికింద్రాబాద్ కంటోన్మెంట్
Tags:    

Similar News