ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీకి అనేక మంది నేతలు గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. కొంతమంది బీజేపీలోకి వెళ్ళగా మరికొంతమంది వైసీపీలోకి వెళ్ళేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా కూడా వైసీపీలోకి వెళ్లబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆయన తిరిగి రాగానే వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే ఆయన వైసీపీలో చేరబోతున్నట్లు పరోక్ష సంకేతాలు కూడా ఇచ్చారు.
అయితే బొండా ఉమాని చేర్చుకోవడానికి వైసీపీ అంత ఆసక్తి కనపరచడం లేదని తెలుస్తోంది. బొండా ఉమా ప్రస్తుతం టీడీపీ నుంచి విజయవాడ సెంట్రల్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ వైసీపీ నుంచి మల్లాది విష్ణు ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో ఉమాకి భవిష్యత్తులో కూడా సెంట్రల్ సీటు ఇచ్చే ప్రసక్తి లేదు. అటు తూర్పు నియోజకవర్గానికి వెళ్లమన్న...వెళ్ళేందుకు బొండా సుముఖంగా లేడు. దీంతో ఉమా కంటే అతి తక్కువ కాలంలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న టీడీపీ యువనేత దేవినేని అవినాష్ ని పార్టీలోకి లాక్కుంటే బెటర్ అనుకుంటున్నారని సమాచారం.
ఈస్ట్ లో దేవినేనికి మంచి పట్టుంది. గతంలో అవినాష్ నాన్న ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. అవినాష్ ఇళ్లు కూడా ఈస్ట్ నియోజకవర్గంలోనే ఉంది. దీంతో వైసీపీ దేవినేనికి ఈస్ట్ నియోజకవర్గం పగ్గాలు ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే వైసీపీలోకి వెళ్ళడం...వెళ్లకపోవడం అవినాష్ ఇష్టం....కానీ ఆఫర్ అయితే చేసినట్లు తెలుస్తోంది. దీనికి తోడు గత నాలుగు రోజుల నుంచి అవినాష్ పార్టీ మారబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది. సొంత పార్టీ నేతలే తనని బయటకి పంపించడానికి చూస్తున్నారని...అందుకే అవినాష్ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ అవినాష్ టీడీపీలోనే కొనసాగుతానని ఓ ప్రకటన చేశారు.
అయితే వైసీపీ మాత్రం అవినాష్ కి గేలం వేస్తూనే ఉందని....ఉమా కంటే అవినాష్ లాంటి నాయకుడిని పార్టీలోకి తెచ్చుకుంటే ఇంకా బలపడుతుందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పైగా అవినాష్ కి ఫాలోయింగ్ తో పాటు....ఆర్ధిక బలం కూడా బాగా ఉండటంతో...వైసీపీ ఎలా అయిన తమ పార్టీలోకి లాగేయాలని చూస్తోంది. ఇక నగర రాజకీయాల్లో కీ రోల్ పోషించాలనుకుంటోన్న అవినాష్‌కు ఎప్పటకీ ఆ ఛాన్స్ వచ్చే ప్రశక్తే లేదు. మొన్న గుడివాడలో ఓడిన అవినాష్ మళ్లీ పోటీ చేస్తే అక్కడే చేయాలి. నగర టీడీపీలో చాలా ఉద్దండులు అయిన నాయకులు ఉన్నారు. వారిని కాదని అవినాష్‌కు ఛాన్స్ రాదు. అదే వైసీపీలో అయితే ఈస్ట్ పగ్గాలు ఇప్పటికిప్పుడే ఇచ్చే ఛాన్స్ ఉంది. చూడాలి మరి అవినాష్ ఫ్యూచర్ డెసిషన్ ఎలా ఉంటుందో ?