భార‌త్ లో ఎన్నిక‌ల‌పై జుక‌ర్ బ‌ర్గ్ కీల‌క హామీ!

Update: 2018-04-11 10:20 GMT
ఫేస్ బుక్ వ్య‌వ‌స్థాప‌కుడు మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ తాజాగా కీల‌క వ్యాఖ్య చేశాడు. మంగ‌ళ‌వారం అమెరికా కాంగ్రెస్ సంధించిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానాలు ఇచ్చారు.ల‌క్ష‌లాది మంది వ్య‌క్తిగ‌త డేటా అక్ర‌మంగా బ‌య‌ట‌కు వెల్ల‌డైన నేప‌థ్యంలో ఆ అంశాల‌పై ఆయ‌న మాట్లాడారు. కాంగ్రెస్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా 2018లో జ‌రిగే కీల‌క ఎన్నిక‌ల్లో ఫేస్ బుక్ మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉంటుంద‌ని.. ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌కుండా తాము జాగ్ర‌త్త‌లు తీసుకుంటామ‌న్నారు. 2018.. 2019ల‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో జ‌రిగే ఎన్నిక‌ల విష‌యంలో డేటా చౌర్యం జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌టంతో పాటు.. ఎన్నిక‌ల నైతిక‌త‌ను ప‌రిర‌క్షించేందుకు తాము చేయ‌గ‌లిగిన‌దంతా చేస్తామ‌ని తాను వ్య‌క్తిగ‌తంగా హామీ ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

ప్ర‌పంచవ్యాప్తంగా భార‌త‌దేశం.. బ్రెజిల్‌.. మెక్సికో.. పాకిస్థాన్.. హంగేరి.. లాంటి దేశాల్లో కీల‌క ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని .. వాటి నైతిక‌త‌ను ప‌రిర‌క్షిస్తామ‌న్నారు. అక్ర‌మంగా వెల్ల‌డైన డేటాపై స్పందిస్తూ.. అందుకు తానే బాధ్య‌త వ‌హిస్తాన‌ని వెల్ల‌డించారు. "ఇది క‌చ్ఛితంగా నా పొర‌పాటే. అందుకు క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నా. నేను ఫేస్ బుక్ ను ప్రారంభించా. న‌డుపుతున్నా. ఇక్క‌డ జ‌రిగేదానికి నాదే బాధ్య‌త" అని వ్యాఖ్యానించారు. బూట‌క‌పు వార్త‌లు.. ఎన్నిక‌ల్లో విదేశీ జోక్యం.. విద్వేష‌పూరిత ప్ర‌సంగాలు.. లాంటి వాటిని తాము నిరోధిస్తామ‌న్నారు.
Tags:    

Similar News