ఈటల, తీన్మార్ మల్లన్నకు బీజేపీలో సముచిత స్థానం దొరకుతుందా? లేక వాడుకుని వదిలేస్తారా?
భారతదేశం మొత్తం కాషాయమయం కావాలన్నదే కమలనాథుల తపన.. ఇది కొన్ని రాష్ట్రాల్లో విజయవంతంగా జరిగినా.. మరికొన్ని చోట్ల అస్సలు ఆ పార్టీని పట్టించుకునే నాథుడే లేడు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కాషాయ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. పార్టీని బలోపేతం చేసుకోవాలని రాష్ట్ర నేతలు ఆపసోపాలు పడుతున్న పరిస్థితి అస్సలు అనుకూలించట్లేదు. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు.. కేసులకు బయపడి బీజేపీ గూటికి చేరితే సేఫ్ జోన్‌లో ఉండొచ్చని ఇంకొందరు.. ఇలా చాలా మందే కాషాయ కండువాలు కప్పేసుకున్నారు. అయితే.. చేరిన వాళ్లందరికీ ఏ మాత్రం అధిష్టానం ప్రాధాన్యత ఇస్తోంది.. వాళ్లంతా పార్టీలో సంతృప్తిగానే ఉన్నారా అంటే... ఆ విషయం దేవుడికెరుగు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి.. కమలం గూటికి చేరారు. ఎవరైతే ఆయన్ను దగ్గరుండి కండువా కప్పించారో.. ఇప్పుడు ఉప ఎన్నిక టైమ్‌లో పట్టించుకున్న పాపాన పోలేదనే విమర్శులున్నాయి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమవతున్నారు. ఆయన బీజేపీలో చేరడానికి కారణం కూడా చెబుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో అధికార, విపక్ష పార్టీల నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
అయితే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు బీజేపీ ఇడుపుతున్నా లేదా అనేది మిలియన్ డాటర్ల ప్రశ్న. రకరకాల కారణాలతో కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి.. రక్షణ కోసం తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది బీజేపీ రాజకీయాలు నచ్చకపోయినా ఆ పార్టీలో చేరుతున్నారు. మరికొందరైతే స్వామి కార్యం స్వకార్యం రెండు చక్కబెట్టుకోవచ్చని కాషాయ కండువా కప్పుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం నీళ్లలో చేపల్లాగా ఆ పార్టీలో ఇట్టే కలిసిపోతున్నారు. కానీ కొందరు మాత్రం అంటిముట్టనట్టు ఉంటుంన్నారంట. తెలంగాణ రాజకీయాల్లో మాజీమంత్రి ఈటల రాజేందర్, టీఆర్‌ఎస్‌కు రాజీనామా.. ఆ తర్వాత బీజేపీలో చేరడం చాలా వేగంగా జరిగాయి. ఆయన రాజీనామాలో హుజురాబాద్‌కు ఉప ఎన్నిక వచ్చింది. ఇక మొదటి నుంచి ఎన్నికల ప్రచారం అంతా సాఫిగానే జరిగింది. ఈటలకు బీజేపీ అండగా నిలించింది. ఆ తర్వాత ఏమైందో ఏమో గాని ఈటల ప్రచారం బీజేపీ నేతలు కనుమరుగయ్యారు. అడపాదడపా బీజేపీ నేతలు వచ్చి ప్రచారం చేస్తున్నారనే తప్పు మనస్పూర్తిగా ఈటలకు సహకరించదనే ప్రచారం జరిగింది.
ఈటల కూడా బీజేపీ రాజకీయాల పట్ల నైరాశ్యంతో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల నిర్మల్‌లో బీజేపీ నిర్వహించిన సభలో అటు ఈటలను ఇటు బీజేపీని సమతూకంలో తెచ్చేందుకు కేంద్రమంత్రి అమిత్‌షా ప్రయత్నం చేశారు. అమిత్‌షానే స్వయంగా సభావేదిక నుంచి ఈటలను పరిచయం చేశారు. ఆ తర్వాత ఈటల సభలో మాట్లేండేందుకు అవకాశం కూడా ఇచ్చారు. ఈటల మైక్ అందుకున్నారో లేదో ఇంతలోనే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అలర్ట్ అయ్యారు. ఈటలకు కిషన్‌రెడ్డి ఏదో చెవిలో చెప్పారు. ఆ తర్వాత ఆయన ప్రసంగించారు. అయితే కిషన్‌రెడ్డి చెవిలో ఏం చెప్పారంన్న దానిపై అందరూ ఆతృతగా ఎదురుచూశారు. సహజంగా బీజేపీ నేతలు తమ ప్రసంగాలను జై శ్రీరాం అనే నినాదంతో ప్రారంభించి జై శ్రీరాం అనే నినాదంతో ముగిస్తారు. ఇదే విషయాన్ని కిషన్‌రెడ్డి, ఈటలకు చెప్పాంట. బీజేపీలో చేరినప్పటి నుంచి ఈటల నోటి నుంచి జై శ్రీరాం అనే పదం రాలేదని చెబుతున్నారు. ఎందుకంటే ఆయన మనస్పూర్తిగా బీజేపీలో చేరలేదని చెప్పే వారు ఉన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెట్టిన కేసుల నుంచి తాత్కాలికంగా బయటపడాలంటే ఈటలకు బీజేపీలో చేరడమే ఏకైక మార్గంగా భావించి ఆ పార్టీలో చేరాలని ఈటల సన్నిహితులు చెబుతున్న మాట. ఇక బీజేపీ కూడా హుజురాబాద్‌లో బీజేపీని గెలిపించుకుని అసెంబ్లీ పార్టీ ప్రాభల్యాన్ని పెంచుకోవాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం.
ఇదే కోవలేనే తీన్మార్ మల్లన్న బీజేపీలోకి వస్తున్నారని ఆయన టీం సభ్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఈటల, మల్లన్న ఇద్దరూ టీఆర్‌ఎస్ బాధితులేననే ప్రచారం జరుగుతోంది. ఇక్కడ తేడా ఏమిటంటే ఈటల జైలుకు వెళ్లకముందే టీఆర్‌ఎస్ చేరారు. మల్లన్న జైలుకు వెళ్లిన తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగి.. మల్లన్న బీజేపీలోకి వస్తే జై భీం అని నినదిస్తారో... జై శ్రీరాం అని రాజీపడుతారో వేచి చూడాలి. అయితే 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బీజేపీలు ధీమా చెబుతున్నారు. బీజేపీలో ఏ పార్టీ నుంచి వచ్చిన సాదరంగా ఆహ్వానిస్తున్నారు. వారి రాజకీయ నేపథ్యం, ప్రజల్లో పలుకుబడి ఉందా లేదా అనే విషయాన్ని పట్టించుకోవడం లేదు. బీజేపీలో మొదటి నుంచి సంఘ్‌తో అనుబంధం ఉన్న వారికే అధిక ప్రధాన్యత ఇస్తున్నారు. ఏపీలో కన్నా లక్ష్మీనారాయణను దింపి.. సంఘ్ నేపథ్యం ఉన్న సోము వీర్రాజుకు బాధ్యతలు అప్పగించారు. రేపు తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని బీజేపీ రాజకీయాలను దగ్గర నుంచి పరిశీలిస్తున్న వారు చెబుతున్నారు. అయితే హుజురాబాద్‌లో బీజేపీ ఓడిపోతే ఈటల పరిస్థితి ఏమిటనే ప్రశ్నకూడా వస్తోంది. రేపు మల్లన్న కూడా బీజేపీలోకి వస్తే ఆయన పట్ల ఎలా వ్యవహరిస్తారనే అనే అనుమానాలు ఇప్పటి నుంచే వ్యక్తమవుతున్నాయి. అరవుకు తెచ్చుకున్న నేతలను అందలానికి ఎక్కిస్తారో? లేక అవసరం తీరిన తర్వాత పాతాళంలోకి తొక్కేస్తారో వేచి చూడాలి మరీ.