టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఈ మధ్య తుంటరి పనులు చేస్తున్నాడు. ప్రపంచంలోనే అగ్ర సోషల్ మీడియా ట్విట్టర్ ను కొంటానని సాంతం వాడేసుకొని మోసం చేసిన ఆయన చూపు తాజాగా మరో సంస్థపై పడింది. ఈసారి ఫుట్ బాల్ ఫ్రాంచైజీని కొంటానంటూ బయలు దేరాడు. ఎలన్ మస్క్ కడదాకా మాట మీద ఉంటాడా? అనే కోణంలో చాలా మందిలో సంశయాలు వచ్చాయి.
ట్విట్టర్ లో నకిలీ ఖాతాలు ఎక్కువగా ఉన్నాయని ఎలాన్ మస్క్ ఆ ఒప్పందం నుంచి వైదొలిగాడు. అందుకే ట్విట్టర్ కొనుగోలు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు. దీంతో ఎలాన్ మస్క్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. తాజాగా ఆయన మాంచెస్టర్ యునైటెడ్ అనే ఫుట్ బాల్ టీంను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించి మళ్లీ అందరిలో చర్చనీయాంశమయ్యాడు. ఇప్పటికే ట్విట్టర్ ను కొనుగోలు చేస్తున్నట్లు అన్ని సంతకాలు చేసి తరువాత తప్పుకుని వివాదాల్లో ఇరుక్కున్న మస్క్ తాజాగా మాంచెస్టర్ యునైటెడ్ ను సైతం అదే విధంగా చేస్తారేమోననే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి
ప్రపంచంలోనే ధనవంతుడైన ఎలాన్ మస్క్ మాంచెస్టర్ యునైటెడ్ ను కొనుగోలు చేస్తున్నట్లు ట్వీట్ చేశాడు. ఇంగ్లిష్ ఫుట్ బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకోవడమే అందరిలో అనుమానాలకు తావిస్తోంది.
ఎలాన్ మస్క్ నిర్ణయాన్ని నమ్మొచ్చా లేదా అని కొందరు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. గతంలోనే ట్విట్టర్ ను కొనుగోలు చేస్తానని చెప్పి అకస్మాత్తుగా ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరిలో అపోహలు వచ్చేలా చేయడం గమనార్హం.
ఇంగ్లిష్ మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ ప్రస్తుతం అమెరికన్ గ్లేజర్ కుటుంబం నియంత్రణలో ఉంది. మస్క్ చేసిన ట్వీట్ కు ఆ కుటుంబం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మస్క్ కొనుగోలు చేయాలని అనుకున్నా ఎందుకు అనేది స్పష్టం చేయలేదు. ఫుట్ బాల్ టీం అయినా కొంటాడా? లేక బిడ్ వేసి వదిలేస్తాడా? అన్నది డౌట్ కొడుతోంది.
మాంచెస్టర్ క్లబ్ యజమానులైన గ్లేజర్ కుటుంబం నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం కూడా ఆలోచనలకు తావిస్తోంది. ఎలాన్ మస్క్ చేసిన ప్రతిపాదనకు ఎవరి నుంచి కూడా ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడం కూడా అనుమానాలకు అవకాశం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ కోరిక తీరుతుందా? లేక ఏదో ఆటపట్టించడానికి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారా అనేది తేలాల్సి ఉందని పలువురు చెబుతున్నారు.