ఉప ఎన్నిక వస్తే ఈటలపై పోటీచేసేది ఆయనే?

Update: 2021-05-06 11:05 GMT
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా దిశగా అడుగులు వేస్తున్నాడు. పార్టీకి , శాసనసభ్యత్వానికి రాజీనామా చేసేలా ఉన్నారు. దీంతో ఉప ఎన్నిక రావడం ఖాయంగా కనిపిస్తోంది. కరీంనగర్ జిల్లాలోని కీలకమైన హుజూరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ కు కంచుకోట.. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ టీఆర్ఎస్ గెలుస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇక్కడ ఈటలను కొట్టే ధీటైన అభ్యర్థిని నిలపాలని టీఆర్ఎస్ యోచిస్తున్నట్టు సమాచారం.

ఈ క్రమంలోని నియోజకవర్గంలోని నేతలకంటే కూడా ఈటలను ఢీకొట్టేందుకు కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ ను బలమైన అభ్యర్థిగా బరిలో దించాలని టీఆర్ఎస్ అధిష్టానం యోచిస్తోంది.

గతంలో కమలాపూర్ నియోజకవర్గంగా హుజూరాబాద్ ఉండేది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు హన్మకొండ ఎంపీగా వినోద్ గెలిచారు. ఆ తర్వాత పునర్విభజనలో వరంగల్ ఎస్సీగా మారడంతో కరీంనగర్ ఎంపీగా వినోద్ మారారు. ఇక హుజూరాబాద్ కూడా కరీంనగర్ ఎంపీ పరిధిలోకి మార్చారు. రాజకీయంగా ఇక్కడ వినోద్ కు బలం ఉంది. ఆర్థికంగా వ్యూహపరంగా వినోద్ కుమార్ మాత్రమే ఈటలకు సమఉజ్జీగా ఉంటారని పార్టీ నాయకత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం.

ఇక కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన వినోద్ కుమార్ గెలిస్తే మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోంది. కేసీఆర్ ఈయనను ఇప్పటికే తన కుడిభుజంగా ప్రణాళిక సంఘం వైఎస్ చైర్మన్ గా చేశారు. ఈటలను ఓడిస్తే ఖచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకుంటారు.
Tags:    

Similar News