జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు మరి కొద్ది సేపట్లోనే అధికారికం గా వెలవడబోతున్నాయి. అయితే ఇప్పటికే అక్కడ గెలుపు ఖాయమైంది. దేశంలో బలమైన పార్టీగా ఉన్న బీజేపీ ని ఓడించి జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ పీఠమెక్కబోతున్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ, జేఎంఎం పార్టీలు కలిసి పోటీ చేసి బీజేపీ ని ఓడించాయి. ఈ మూడు పార్టీలు జార్ఖండ్ సీఎం గా హేమంత్ సోరెన్ ను ప్రకటించాయి. అసలు ఎవరీ హేమంత్.. బలమైన బీజేపీ ని ఎలా ఓడగొట్టాడు? ఈయన బలం బలగం ఏంటి? తెలుసుకుందాం..
జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) పార్టీ అధ్యక్షుడే హేమంత్ సోరెన్. దివంగత జార్ఖండ్ సీఎం శిబుసోరెన్ కుమారుడు. బలమైన బీజేపీ ని ఓడగొట్టడానికి కాంగ్రెస్, ఆర్జేడీల తో కలిసి కూటమి కట్టి ఘన విజయం సాధించారు.
హేమంత్ సోరెన్ ఆధ్వర్యం లో సాగిన భూ పోరాటాలే ఆయనను విజయ తీరాలకు చేర్చాయి. దేశంలోనే అత్యధిక ఖనిజ సంపదలు జార్ఖండ్ లో ఉన్నాయి. దాదాపు 45శాతం ఖనిజ సంపద ఉన్న ఇక్కడ గిరిజనులు ఎక్కువ. వారి హక్కుల ను కాపాడే పోరాటం లో హేమంత్ ముందుండి పోరాడారు. పెద్ద కులాలు, పెద్ద కంపెనీల చేతుల్లో గిరిజనులు మోసపోకుండా అండగా నిలిచారు. 2016లో గిరిజనుల భూములను కంపెనీలకు ధారదత్తం చేసేందుకు బీజేపీ సర్కారు చట్టం తేగా.. దానికి వ్యతిరేకం గా భూమి హక్కుల పోరాటాన్ని పెద్ద ఉద్యమంగా హేమంత్ మలిచారు. లక్షలాది మంది గిరిజనుల తో రోడ్డెక్కి హేమంత్ నిరసనలు తెలిపారు.
బీజేపీ ప్రభుత్వం భూ చట్టాలను మార్చి కార్పొరేట్లకు బార్లా తెరిచి గిరిజనులను ముంచుతోందన్న హేమంత్ మాటలను జనాలు నమ్మారు. దీంతో ఈసారి హేమంత్ కూటమినే ప్రజలు గెలిపించారు. గిరిజన హక్కుల కోసం పోరాడిన హేమంత్ నే కాంగ్రెస్, ఆర్జేడీలు సీఎం అభ్యర్థిగా ప్రకటించాయి.
2013లో తొలిసారి హేమంత్ సీఎం అయ్యారు. ఆరు నెలలకే ప్రభుత్వం పడిపోయింది. మెజార్టీ లేకపోవడంతో ప్రభుత్వం కూలింది. ఈసారి స్పష్టమైన మెజార్టీ తో గద్దెనెక్కబోతున్నారు. బీజేపీ పై వ్యతిరేకులంతా కూటమి కి మద్దతు ఇవ్వడం తో హేమంత్ గెలుపు నల్లేరు పై నడకలా మారింది.