బీజేపీకి ఎమ్మెల్సీ ఇస్తారా? ఏపీలో పెద్ద క్వచ్ఛన్ మార్క్?

Update: 2021-03-08 11:04 GMT
నాడు పొత్తులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీకి రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చాడు. అయితే కాలం గడిచిపోయింది. ఇప్పుడా పదవీ కాలం దగ్గరపడింది. బీజేపీకి ఉన్న రెండు ఎమ్మెల్సీల్లో సోము వీర్రాజు పదవీకాలం ఈ సంవత్సరంలో ముగియబోతోంది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా దాన్ని బీజేపీకే మళ్లీ ఇవ్వాలని బీజేపీ వాదిస్తోందట..

అయితే బీజేపీకి ఇస్తాం కానీ.. సోము వీర్రాజుకు మాత్రం ఈ ఎమ్మెల్సీ పదవి ఇవ్వం అని వైసీపీలో టాక్ నడుస్తోందట..  ఎందుకంటే 2015 ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు చంద్రబాబును పొగిడి ఎమ్మెల్సీ పదవిని సోము వీర్రాజు తెచ్చుకున్నాడన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే ఇదే సోము వీర్రాజు.. బీజేపీతో చంద్రబాబు తెగదెంపులు చేసుకున్నాక తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశాడు..

ఇప్పుడు జగన్ కేంద్రంలోని బీజేపీతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా ఆ టికెట్ ను సోము వీర్రాజుకే మళ్లీ ఇస్తే వైసీపీని ఆయన తిట్టకుండా ఉండరు అని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారట.. సోము వీర్రాజుకు కాకుండా ఎవరికైనా ఇస్తామని.. వేరొక నేత పేరు చెప్పాలని వైసీపీ నేతలు అంటున్నారట.. కానీ దీనిపై పూర్తి సమాచారం లేదు అంట..

బీజేపీ వాళ్లు అడుగుతారా? లేదా అని కింది స్థాయి బీజేపీలో చర్చ జరుగుతోందట.. వైసీపీలో మాత్రం ఇవ్వకూడదు అని అంటున్నారట.. బీజేపీకి ఇస్తే టీడీపీకి టార్గెట్ అవుతామని.. సోషల్ మీడియాలో వైసీపీని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తారని కూడా అంటున్నారు. చూడాలి రాజకీయంలో ఏదైనా మారోచ్చని.. బీజేపీకి ఎమ్మెల్సీ సీటు వైసీపీ ఇస్తుందా? ఇవ్వదా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తోంది.
Tags:    

Similar News