కర్నూలు పార్లమెంటు మాజీ ఎంపీ.. బుట్టా రేణుక రాజకీయంగా తెరమరుగయ్యారా ? ప్రస్తుతానికి తెరచాటునున్నారా? అనే విషయం ఆసక్తిగా మారింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన రేణుక.. ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నప్పటికీ.. పట్టించుకునే వారు కనిపించడం లేదు. పార్టీ అధినేత జగన్‌కు ఆమె విషయంలో సానుభూతి.. అభిమానం ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోం ది. పైగా ఆమె వ్యవహరించిన తీరుతో.. పార్టీ నేతలు ఎవరూ ఆమెతో కలివిడిగా తిరగడం లేదు. 2014 ఎన్నికల్లో కర్నూలు నుంచి ఎంపీగా విజయం దక్కించుకున్న రేణుక.. రాష్ట్రంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
వైసీపీలోనూ ఆమెకు మంచి గౌరవం దక్కింది. రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో బలమైన వాయిస్ వినిపించేవారు. అయితే.. 2017లో ఆమె టీడీపీ అధినేత చంద్రబాబుకు చేరువ కావడంతో వైసీపీ నేతలు మానసికంగా దూరమయ్యారు. పైకి పార్టీ మారకపోయినా.. చంద్రబాబు అభివృద్ధి మంత్రానికి తాను ఫిదా అయ్యానని రేణుక అప్పట్లో బహిరంగంగా ప్రకటించారు. అయితే.. 2019 ఎన్నికలకుముందు.. ఆమె కోరుకున్న అసెంబ్లీ సీటు ఇచ్చేందుకు చంద్రబాబు నిరాకరిస్తున్న సంకేతాలు రావడంతో.. మళ్లీ జగన్‌కే జైకొట్టారు. అయితే.. అప్పటికే.. కర్నూలు ఎంపీ టికెట్‌ను జగన్ వేరే వారికి కేటాయించడంతో.. విధిలేని పరిస్థితిలో పార్టీకి ప్రచారం చేయాల్సి వచ్చిందని.. రేణుక అనుచరులు పేర్కొన్నారు.
అయితే.. పార్టీ అధికారంలోకి రాగానే గుర్తింపు కల్పిస్తామన్న జగన్.. ఇప్పటి వరకు తనను పట్టించుకోలేదని.. రేణుక తల్లిడిల్లు తున్నారు. బీసీ చేనేత వర్గానికి చెందిన ఆమె కీలక పదవి వస్తుందని ఎన్నో ఆశలతో ఉన్నారు. ఇప్పటికే తాడేపల్లికి రెండు సార్లు వచ్చి వెళ్లిన ఆమె.. తొలుత రాజ్యసభ సీటును ఆశించారు. అయితే.. అది దక్కలేదు.. ఈ క్రమంలో తర్వాత. ఎమ్మెల్సీ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే.. దీనిపై ఎలాంటి నిర్ణయమూ.. తేల్చడం లేదు.
త్వరలోనే మరిన్ని ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండడం.. వాటిని భర్తీ చేసేందుకు వైసీపీ అధినేత పరిశీలన చేస్తుండడంతో బుట్టాను ఈ సారైనా మండలికి పంపుతారా? అనే సందేహాలు వస్తున్నాయి. అయితే.. లోకల్‌టాక్ మాత్రం.. ఆమెకు అవకాశం దక్కదనే అంటున్నారు. మరి బుట్టా విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు ? అనేది ఆసక్తిగా మారింది.