రెండంటే రెండు పార్టీలు..నువ్వా నేనా అన్న విధంగా రాజకీయ వాగ్వాదాలకు దిగుతున్నాయి. ఓ విధంగా టీడీపీ కన్నా జనసేన పార్టీనే ఎక్కువగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ఓట్లు మరియు సీట్లు అన్నవి పట్టించుకోకుండా జగన్ పై పోరాటం చేస్తోంది. పోరాట ఫలితంగా కొన్ని మంచి పరిణామాలు కూడా నమోదు అవుతున్నాయి. జనసేన ఆవిర్భావ వేళ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చం అని పవన్ చెప్పగానే జగన్ అప్రమత్తం అయిపోయారు. ఆ విధంగా ఎంపీలకూ,ఎమ్మెల్యేలకూ దిశా నిర్దేశం చేశారు. ఓ విధంగా పనిచేయని వారంతా తప్పుకుంటే మేలు అని ఆ రోజే చెప్పేశారు.
అంటే రాష్ట్రంలో టీడీపీ కన్నా ప్రధాన ప్రత్యర్థిగా జనసేనను పరిగణనలోకి వైసీపీ తీసుకుంటోందని, గత ఎన్నికల్లో కూడా జనసేన ప్రాభవాన్ని కొట్టి పారేయలేం అని పరిశీలకులు సైతం ఒప్పుకుంటున్నారు. శ్రీకాకుళంలో తక్కువ మెజార్టీతో గెలిచిన ధర్మాన కానీ లేదా మరొకరు కానీ ఆ రోజు జనసేన ఒంటరి పోరు కారణంగానే అనూహ్య రీతిలో లబ్ధి పొంది ఇవాళ శాసనసభలో చోటు దక్కించుకున్నారు అని కూడా జనసేన వివరిస్తోంది. ఓ విధంగా తమ తప్పిదం కారణంగా వీరంతా ఇవాళ మాట్లాడుతున్నారని కూడా అంటోంది.
ఈ దశలో గత ఎన్నికల ఫలితాలు మరో సారి వెలుగులోకి వస్తున్నాయి. ఆ రోజు తాము ఒంటరిగా పోటీచేసిన కారణంగా వైసీపీకి ఏ విధంగా అనూహ్య రీతిలో విజయాలు నమోదు చేసిందన్నది చెబుతోంది జనసేన.ఇదే సమయంలో తాము ఏయే నియోజకవర్గాలను ఏ విధంగా ప్రభావితం చేశామో అన్నది కూడా వివరిస్తోంది. అందుకే జగన్ తమను చూసి భయపడిపోతున్నారన్నది జనసేన మాట. ఆ రోజు ఉన్న పరిస్థితుల రీత్యా టీడీపీ,జనసేన జట్టుకట్టని కారణంగానే వైసీపీ ఇవాళ అధికారంలోకి వచ్చిందని, ఓ విధంగా ఆ రోజు తాము టీడీపీతో జట్టు కట్టి ఉంటే ఇవాళ జగన్ తో ఎందరెందరో విపక్షంలోనే ఉండేవారని వివిధ గణాంకాలతో సహా వివరిస్తున్నారు.
శ్రీకాకుళం లాంటి మారుమాల ప్రాంతాలు మొదలుకుని తిరుపతి లాంటి మహానగరం వరకూ తమ హవా అన్నది స్పష్టమని అంటున్నారు. ఒక్క శ్రీకాకుళంలోనే వైసీపీ ఆధిక్యం 4 వేల 813 ఓట్లు కాగా ఇక్కడ జనసేనకు వచ్చిన ఓట్లు 7 వేల 440 ఓట్లు కావడం గమనార్హం.అందుకే జగన్ మరోసారి పునరాలోచనలో పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు వైసీపీ ఆధిక్యం చూపిన 32 చోట్ల జనసేన ప్రభావం తీవ్ర స్థాయిలో ఉందని కూడా ప్రధాన మీడియా అంటోంది. ఆ విధంగా చూసుకుంటే విజయనగరం, శ్రీకాకుళం ఎమ్మెల్యేలను దగ్గరుండి గెలిపించింది జనసేనే !
ఇదే ఉత్తరాంధ్రకు చెందిన అనకాపల్లి, యలమంచిలి (ఈ రెండూ విశాఖ జిల్లాకు చెందిన నియోజవకవర్గాలు) ఎమ్మెల్యేలను సైతం గెలిపించింది జనసేనే! అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఇవాళ నోటికి వచ్చిందంతా మాట్లాడుతున్నారని ఓ విధంగా ఆయన గెలుపు కూడా తమ భిక్షేనని అంటోంది జనసేన ప్రధాన కార్యవర్గం.
ఆ రోజు యలమంచిలి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కన్నబాబు రాజు కూడా గెలిచింది నాలుగు వేలకు పైగా ఓట్ల తేడాతోనేనని ఆ విషయం మరిచిపోవద్దని పదే పదే అంటోంది. ఇక్కడ తమ ఓటు బ్యాంకు 12 శాతం కాగా, టీడీపీకి వచ్చింది నలభై శాతం..రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తే ఇవాళ యలమంచిలి వైసీపీ అభ్యర్థి ఇంటికే పరిమితం అయ్యేవారు అని కూడా జనసేన వివరిస్తోంది.