బైడెన్‌కు ఉక్రెయిన్ వెళ్లే దమ్ముందా?

Update: 2022-03-21 12:30 GMT
జోబైడెన్‌. అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు. ఈయ‌న ఇప్పుడు ప్ర‌పంచ దేశాల‌కు చాలా ప్ర‌త్యేకం. ఒక‌ర‌కంగా.. చెప్పాలంటే.. యుద్ధో న్మాది అని ఆయ‌న‌ను చాలా దేశాలు విమ‌ర్శిస్తున్నాయి. అదేంటి.. ఆయ‌న ఎలాంటి యుద్ధం చేయ‌డం లేదుక‌దా! అంటారా?  కానీ, ప్ర‌స్తుతం యుద్ధంతో అత‌లాకుత‌లం అవుతున్న ఉక్రెయిన్ ప్ర‌జ‌లు మాత్రం ఇదే మాట అంటున్నారు.

దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ర‌ష్యాను ఎంతగా రెచ్చ‌గొట్టాలో అంతా రెచ్చ‌గొట్టారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తామ‌ని.. ర‌ష్యా చెప్ప‌క‌ముందే.. అదిగో ర‌ష్యా గ‌ర్జిస్తోంద‌ని వ్యాఖ్య‌లు చేసిన బైడెన్‌.. ఉక్రెయిన్‌ను తాము రక్షించుకుంటామ‌ని.. పుతిన్ ఆట‌లు సాగ‌నివ్వ‌బోమ‌ని.. పెద్ద ఎత్తున విరుచుకుప‌డ్డారు.

అంతేకాదు.. క్రెమ్లిన్ (ర‌ష్యా అధ్య‌క్ష నివాసం) చేష్ట‌లు కేవలం తూతూ మంత్రంగా ఉంటాయ‌ని.. ఏమాత్రం .. ఆ దేశానికి యుద్దం చేసే ద‌మ్ము ధైర్యం లేవ‌ని.. వ్యాఖ్యానించిన తొలి అధ్య‌క్షుడు బైడెన్‌. అంతేకాదు.. ఒక‌వైపు.. ఉక్రెయిన్‌ను కాపాడ‌తామ‌ని.. చెబుతూ..నే ఆ దేశంపై ర‌ష్యా యుద్ధం ప్రారంభించిన త‌ర్వాత‌.. చేతులు ముడుచుకుని చూస్తూ ఉండిపోయిన నాయ‌కుడుగా కూడా ఆయ‌న పేరు ప‌డ్డారు.

నిజానికి ఉక్రెయిన్ యుద్ధం కోరుకోలేదు. నాటో దేశాల స‌మాఖ్య‌లో తాము చేర‌తామ‌ని మాత్ర‌మే కోరారు. ఈ విష‌యంలో ఆది నుంచి కూడా అగ్ర‌రాజ్యం దాగుడు మూత‌లు ఆడింది. చేర్చుకునేదీ లేనిదీ చెప్ప‌లేదు. పైగా.. ర‌ష్యాను ఎప్ప‌టిక‌ప్పుడు రెచ్చ‌గొడుతూ వ‌చ్చింది.

చివ‌ర‌కు యుద్ధం తీవ్రత పెరిగిన ద‌రిమిలా.. ముందు నుంచి ఉక్రెయిన్‌ను ఆదుకుంటామ‌ని చెప్పిన బైడెన్‌.. తాము నేరుగా యుద్ధం చేయ‌బోమ‌ని చేతులు ఎత్తేశారు. అంతేకాదు.. తామేనేరుగా జోక్యం చేసుకుంటే అది మూడో ప్ర‌పంచ యుద్ధానికి దారితీస్తుంద‌ని.. కాబ‌ట్టి సేన‌ల‌ను పంపిస్తామ‌ని.. అప్పుడడు.. ర‌ష్యాకు వ్య‌తిరేకంగా యుద్దం కోసంకాద‌ని, ఉక్రెయిన్‌ను ఆదుకునేందుకు మాత్ర‌మే పంపుతామ‌న్నారు. ఇలా ఆది నుంచి కూడా ర‌ష్యాను రెచ్చ‌గొడుతూ. ఉక్రెయిన్‌ను ఉడికిస్తూ.. ప్ర‌స్తుతం సాగుతున్న ధ్వంస ర‌చ‌న‌లో బైడెన్ కీల‌క‌పాత్ర పోషించార‌నేది ప్ర‌పంచ వ్యాఫ్తంగా వ‌స్తున్న ప్ర‌ధాన విమ‌ర్శ‌.

ఇదిలావుంటే. ఇప్పుడు బైడెన్ ఉక్రెయిన్ పొరుగు రాష్ట్ర‌మైన పోలాండ్‌కు వెళ్తున్నారు. ఈ నెల 25న ఆయ‌న పోలాండ్ ప్ర‌ధాని ఆండ్రెస్ దుబాతో భేటీ కానున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ర‌ష్యాదాడుల‌తో అత‌లాకుత‌లం అవుతున్న ఉక్రెయిన్‌కు అమెరికా స‌హా ఇత‌ర రాష్ట్రాలు చేస్తున్న సాయంపై చ‌ర్చించ‌నున్నార‌ట‌.

అయితే.. ఈ సంద‌ర్భంగా కూడా బైడెన్ తీరుపై అనేక అనుమానాలు వ‌స్తున్నాయి. మ‌రోసారి ర‌ష్యాను ఆయ‌న రెచ్చ‌గొడ‌తారా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఇలాగే జ‌రిగితే.. బైడెన్ చ‌ర్య ఏమేర‌కు సమంజ‌సం అని.. ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాదు.. తీవ్రంగా న‌ష్ట‌పోయి, భ‌య‌కంపితులు అవుతున్న ఉక్రెయిన్ ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇచ్చేందుకు అక్క‌డ‌కే ఆయ‌న నేరుగా వెళ్లొచ్చుక‌దా? అనేది ప్ర‌పంచ దేశాల మాట‌.

కానీ, బైడెన్ మాత్రం అలా చేయ‌ర‌ట‌. పోలాండ్‌కు వెళ్లి వెన‌క్కి వ‌స్తార‌ని.. వైట్ హౌస్ వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి. మ‌రి ఈసారి ఎలాంటి మంట పెడ‌తారో చూడాల‌ని అంటున్నాయి... ప్ర‌పంచ దేశాలు. 
Tags:    

Similar News