జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో బీజేపీ మేయర్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత పాతబస్తీ మీద సర్జికల్ స్ట్రైక్ చేసి.. రోహింగ్యాలను, పాకిస్తాన్ కొడుకులను తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు.. బీజేపీ బరాబర్ హిందువుల కోసం పోరాడుతుందని పేర్కొన్నారు. పాతబస్తీలో ఓటర్లు లేని ఎన్నికలు జరగాలన్నారు. ఇటీవలే ఎంఐఎం నేత అసదుద్దీన్ పాతబస్తీలో రోహింగ్యాలుంటే అమిత్ షా ఏం చేస్తున్నారని వాఖ్యానించారు. దీనికి బదులుగా బండి సంజయ్ రోహింగ్యాలను తరిమికొడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ మంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. నాలుగు ఓట్లు, రెండు సీట్ల కోసం ఇంత దిగజారి వ్యాఖ్యలు చేయాలా? అని ట్విట్టర్ లో నిలదీశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకోసం చేస్తున్నారని కేటీఆర్ నిలదీశారు. వెళ్లి కాళ్లు పట్టుకుంటే ఓట్లు వేస్తారు కదా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇక బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమర్థిస్తారా? అని మంత్రి కేటీఆర్ నిలదీశారు. కొన్ని ఓట్లు, సీట్ల కోసం మతిస్థిమితం కోల్పోయి వ్యాఖ్యలు చేస్తున్నారని సంజయ్ పై మండిపడ్డారు.
పచ్చగా ఉండే హైదరాబాద్ లో బీజేపీ నేతలు వచ్చి చిచ్చు పెడుతున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ తల్లడిల్లాలి.. బీజేపీకి నాలుగు ఓట్లు సీట్లు రావాలా? అని కేటీఆర్ ధ్వజమెత్తారు.