జగన్ సర్కారు పై పొగిడేస్తే.. పవన్ వ్యూహం ఫలిస్తుందా?

Update: 2020-07-12 07:50 GMT
రాజకీయాలు చాలా కఠినంగా ఉంటాయి. నిజాన్ని అభినందించటం కూడా ఒక్కోసారి శాపంగా మారుతుంటుంది. కొందరు కొన్ని మాత్రమే చేయాలి. అంతకు మించిన చేస్తే లాభం తర్వాత నష్టమే ఎక్కువ. ఎవరెన్ని చెప్పినా.. రాజకీయాల్ని నిజాయితీగా చేస్తానని చెప్పిన ఏ ఒక్కరూ రాజ్యాధికారాన్ని సొంతం చేసుకున్నది లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ నిజాయితీపరుడే కావొచ్చు.. రాజకీయాల్ని నిజాయితీగా.. నలుగురికి నచ్చేలా చేస్తానంటే అధికారం చేతికి వచ్చేదా? అన్నది ప్రశ్న.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల జగన్ సర్కారును పొగిడేశారు. చక్కగా పని చేస్తుందని కితాబును ఇచ్చారు. అంబులెన్సుల్ని భారీ ఎత్తున ప్రారంభించటం.. కరోనాపరీక్షల విషయంలో ఏపీ సర్కారు వ్యవహారశైలిని మెచ్చుకున్నారు. ఇలా చాలా తక్కువ వ్యవధిలో పవన్ లాంటి నేత నోటి నుంచి రెండుసార్లు జగన్ సర్కారుపై మెచ్చుకోళ్లు రావటం జనసేన వర్గాలకుమింగుడుపడకపోతుంటే.. అందుకు భిన్నంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం తమ ప్రభుత్వ పని తీరు ఎలా ఉందో పవన్ మాటలే చెప్పేస్తున్నాయని చెబుతున్నారు.

రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని పొగిడితే.. అందుకు రాజకీయ పార్టీలు భారీమూల్యం చెల్లించాల్సి ఉంటుంది.తమను పొగిడారు కదా? అని తర్వాతి కాలంలో విమర్శిస్తే ఊరుకునే పరిస్థితుల్లో అధికార పక్ష పార్టీలు ఉండవు. అలాంటప్పుడు మంచి చేశారని అధికారపక్షాన్నివిపక్షం పొడగటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎక్కడిదాకానో ఎందుకు? ఎప్పుడైనా.. ఏదైనా విషయంలో చంద్రబాబు బాగా పని చేస్తున్నారని జగన్.. యువనేత పనితీరు బాగుందని చంద్రబాబుఎప్పుడైనా ఎక్కడైనా పొగడటం చూశారా? అన్న ప్రశ్న వేసుకుంటే సమాధానం ఇట్టేవచ్చేస్తుంది.

ఇంతకీ జగన్ ప్రభుత్వం చేసిన పనుల్ని పవన్ పొగడటంలో రాజకీయ వ్యూహం ఉందన్న మాట వినిపిస్తోంది. తమ పార్టీకి టీడీపీకి లింకు ఉందని తరచూ జగన్ పార్టీ నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో.. తమకుఏ పార్టీపైనా  ప్రత్యేకంగా అభిమానం కానీ ద్వేషం కాదని ఉండదన్న విషయాన్ని చెప్పేందుకు వీలుగా పవన్ పొగడ్తల ప్రోగ్రాం పెట్టినట్లుగా విశ్లేషిస్తున్నారు. అయితే.. ఇలాంటివేమీ వర్క్ వుట్ కావంటున్నారు. పవన్ కు ఈ ఐడియా ఇచ్చిన ఆయన వ్యూహకర్తలు ఎందుకిలాంటి తప్పులు చేయిస్తున్నారు అన్నది ప్రశ్నగా మారింది. సమకాలీన రాజకీయాలకు తగ్గట్లు అడుగులువేయాలేకానీ.. 2020లో 1970నాటి రాజకీయం వర్క్ వుట్ కాదన్నది మర్చిపోకూడదు.
Tags:    

Similar News