పెట్రో బాంబు పేలనుంది.. పోలింగ్ పూర్తైన వెంటనే వాతకు రెఢీ.. లీటరకు ఎంతంటే?
నొప్పి అన్నది అనిపించకుండా.. రోజుకో పది పైసలు.. లేదంటే ఇరవై పైసలు చొప్పున పెంచుకుంటూ పోతూ.. నెల తిరిగేసరికి లీటరుకు మూడు రూపాయిల నుంచి నాలుగైదు రూపాయిల వరకు పెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచేస్తూ.. వాతలు పెట్టేసే మోడీ సర్కారు.. గడిచిన కొద్ది వారాలుగా బాదటం తాత్కాలికంగా బంద్ చేసింది. ఇదంతా ప్రజల మీద ప్రేమ కంటే కూడా.. ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల పుణ్యమే.
ముడిచమురు ధరలు కనిష్ఠంగా ఉన్న రోజుల్లోనే పెంచుడు ఆపని మోడీ సర్కారు.. తాజాగా ఉక్రెయిన్ - రష్యా మధ్య నడుస్తున్న యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు గరిష్ఠానికి చేరుకున్న పరిస్థితి.
తాజాగా ముడి చమురు బ్యారెల్ 102 డాలర్లు (మార్చి 2 నాటి ధరలు) పలుకుతోంది. ఇంత భారీగా ధరలు పెరగటం దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇదేనని చెబుతున్నారు. ఈ పెరిగిన ముడిచమురు ధరల కారణంగా పెట్రోల్.. డీజిల్ పై లీటరుకు దగ్గర దగ్గర రూ.5.7 చొప్పున నష్టపోతున్నట్లుగా లెక్క కడుతున్నారు. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత.. పెట్రో సంస్థలు నష్టపోవటం ఇదే తొలిసారి కావొచ్చు. ఎప్పటికప్పుడు జనాల్ని బాదేయటం.. పెట్రో సంస్థలకు భారీ లాభాల్్ని అందించేలా నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే.
ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల్లో చివరి అంకం ఈ నెల 7తో పూర్తి కానుంది. పదో తేదీన ఓట్ల లెక్కింపు.. ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఆ వెంటనే.. పెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచేస్తూ నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ఉక్రెయిన్ -రష్యాల మధ్య నెలకొన్న యుద్దం కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో ఎంత మొత్తంలో లీటరు పెట్రోల్.. డీజిల్ ధరలు పెరుగుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక అంచనా ప్రకారం లీటరుకు రూ.7 నుంచి రూ.10 మధ్య పెంచాల్సి ఉంటుందని చెబుతున్నారు.
అయితే.. ఇంత భారీగా ధరల్ని ఒక్కసారిగా పెంచితే ప్రజల్లో వ్యతిరేకత రావటం ఖాయం. అందుకే.. తొలుత లీటరు పెట్రోల్.. డీజిల్ కు రూ.2 నుంచి రూ.4 మధ్యలో పెంచేయట.. రోజువారీగా 20 పైసల నుంచి ముప్ఫై పైసల మధ్యలో పెంచుకుంటూ పోవటం ద్వారా.. ఒక నెలలో తాము అనుకున్న మేర పెంచే వీలుందన్న భావన వ్యక్తమవుతోంది. యుద్ధం తీవ్రత పెరిగే కొద్దీ ముడి చమురు ధరలు పెరగటం ఖాయం. అంటే.. రానున్న రోజుల్లో దేశ ప్రజల మీద పెట్రో బాంబ్ పేలనుందని చెప్పక తప్పదు. ఇంకెందుకు ఆలస్యం.. నడ్డి విరిచేలా ఉంటే పెట్రోల్.. డీజిల్ ధరల పెంపునకు మానసికంగా సిద్ధంగా ఉండండి.