రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం ఉంటుందా?

Update: 2020-06-15 06:30 GMT
తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడా? రాడా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ ప్రశ్న. ఆయన పార్టీ కోసం కళ్లు కాయలు కాసి పండ్లు అయ్యేలా కార్యకర్తలు, నేతలు, అభిమానులు ఎదురుచూస్తున్నారు.అయితే తమిళనాడులో ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉన్నా రజినీకాంత్ మాత్రం మౌనం వీడడం లేదు. పార్టీ ఏర్పాటు పై స్పష్టత ఇవ్వడం లేదు.

ఇటీవలే తన ప్రజాసంఘం నిర్వాహకులతో భేటి అయ్యారు  రజినీకాంత్. కానీ ఈ సమావేశం అనంతరం పార్టీ పేరు, ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారనే విషయాలను మాత్రం రజినీ చెప్పకుండా సస్పెన్స్ లో పెట్టారు.

రాజకీయాల్లోకి రావడంపై తనకు మూడు ప్రణాళికలున్నాయని రజినీకాంత్ తన ప్రజాసంఘం నిర్వాహకులతో చెప్పారట.. యువరక్తాన్ని పార్టీలో నింపడం.. పార్టీలో ఒకే వ్యక్తి పెత్తనం లేకుండా చేయడం.. పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ అధినేతగా మాత్రమే కొనసాగుతానని.. ముఖ్యమంత్రిగా మరో అభ్యర్థి ఉంటారని.. సంచలన వ్యాఖ్యలు చేశారు.  

జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయ శూన్యత ఏర్పడిందని.. తనకూ మూడు ప్రణాళికలున్నాయని రజినీ తెలిపారు.రాజకీయ నాయకులకు ప్రజలు అంటే ప్రయోజనాలు సంక్షేమం కాదని స్పష్టం చేశారు.

ప్రస్తుతం రజినీకాంత్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ‘ఆన్నాత్తా’ సినిమాలో నటిస్తున్నారు. మరో మూడు చిత్రాలకు రజినీకాంత్ పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది.  లారెన్స్, కనకరాజు దర్శకత్వంలో నటిస్తారని తెలుస్తోంది.  శంకర్ తో కలిసి మరో చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మరో మూడేళ్ల వరకు సినిమాలు తీసి తర్వాత రిటైర్ అవుతారని తెలుస్తోంది. ప్రస్తుతం రజినీకాంత్ వయసు 69. వచ్చే ఏడాది ఏప్రిల్ లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు. ఈ నేపథ్యంలోనే రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడా రాదా అన్నది అనుమానంగా మారింది.
Tags:    

Similar News