జనాలంతా రెడీగా ఉండాల్సిందేనా ?

Update: 2022-02-24 06:44 GMT
జనాలంతా వాయింపుడుకు రెడీ అయిపోవాల్సిందేనా ? ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగింపుకు వస్తున్న వేళ జనాల్లో ఇదే ఆందోళన పెరిగిపోతోంది. దాదాపు 120 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. దీనికి ప్రధాన కారణం ఐదు రాష్ట్రాల ఎన్నికలనే చెప్పాలి. పెట్రోల్, డీజిల్ ధరల పెరిగే ప్రభావం తమపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని కేంద్రంలోని పెద్దలకు బాగా తెలుసు. అందుకనే ఐదు రాష్ట్రాల్లో ఎనికల మూడ్ మొదలైన దగ్గర నుంచి ధరలు పెంచలేదు.

 అయితే పంజాబ్,  గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ లో ఎన్నికల వేడి దాదాపు తగ్గిపోయింది.  ఉత్తరప్రదేశ్ లో మాత్రం ఇంకా మూడు దశల పోలింగ్ జరగాల్సుంది. ఇది కూడా అయిపోతే వెంటనే పెట్రోలు, డీజల్ ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చేయడం ఖాయం. దీనికి రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం అదనంగా తోడవుతోంది. ప్రపంచ క్రూడాయిల్ ఉత్పత్తిలో రష్యా వాటా 10 శాతం. ఇపుడు యుద్ధ వాతావరణం నేపథ్యంలో రష్యా క్రూడాయిల్ సరఫరా నిలిపేసింది.

 దీనివల్ల క్రూడాయిల్ బ్యారెల్ ధర 120 డాలర్లకు చేరుకుంది. కొద్దిరోజుల్లో దీని ధర మరింతగా పెరిగే అవకాశముంది. అంటే యూపీలో మిగిలిన మూడు దశల పోలింగ్ పూర్తయిపోవటం, యుద్ధ వాతావరణంపై క్లారిటి ఒకేసారి వచ్చే అవకాశముంది. ఇంకేముంది పెట్రోలు వాతలు పెట్టడానికి నరేంద్ర మోడీ సర్కార్ రెడీగా కాచుక్కూర్చునుంది. ఆ మధ్య ఆల్ టైం హై అన్నట్లుగా దేశంలో కొన్ని చోట్ల పెట్రోల్ లీటర్ ధర రు. 115 కి చేరుకోగా డీజల్ లీటర్ ధర 100 రూపాయలు దాటింది.

ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ఎన్నికల ప్రక్రియ పూర్తయిన పోగానే లీటర్ పెట్రోలు ధర 150 రూపాయలకు పెరిగినా ఆశ్చర్యం లేదు. ఆ మధ్య పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోయినపుడు మోడి సర్కార్ ను తిట్టని జనాలు లేరు. అలాంటిది మళ్ళీ అలాంటి పరిస్ధితే వచ్చేట్లుంది.

అయినా జనాల గోడును మోడీ సర్కార్ ఏనాడూ పట్టించుకున్నపానాన పోలేదు. మోడి ప్రధానమంత్రయిన దగ్గర నుండి బడా బాబుకు వడ్డిస్తూ మామూలు, మధ్యతరగతి జనాలను మాత్రం వాయించేస్తున్నారు.

 
Tags:    

Similar News