ముఖ్యమంత్రికే సవాల్ విసరడం...అది కూడా జైల్లో ఉండి అంటే ఆశ్చర్యకరమే. సీఎంకు నా తడాఖా చూపిస్తాను అంటూ హై రేంజ్‌లో సవాల్ విసిరాడంటే ఆ వ్యక్తి మామూలోడు కాదన్నట్లే. అవును నిజంగా అలా మామూలోడు కాని వ్యక్తే ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం ఉద్యమ బాట పట్టిన రోజుల వ్యవధిలోనే దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న గుజరాత్ యువ సంచలనం హార్దిక్ పటేల్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గుజరాత్‌లో పటేళ్లకు రిజర్వేషన్ల కోసం సాగించిన ఉద్య మం నేపథ్యంలో హార్దిక్ పటేల్ పై రెండు రాజద్రోహం కేసులు నమోదయ్యాయి. దీనితో ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలతో సూరత్ జైలుకు తరలించారు. ఈ కేసుల విచారణ కోసం సూరత్‌లోని ఓ కోర్టుకు హార్దిక్‌ను పోలీసులు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా స్థానిక మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. రిజర్వే షన్లను సాధించే దాకా విశ్రమించేది లేదని గతంలోనే నిర్ణయించుకున్నానని చెప్పిన హార్దిక్ జైలు నుంచి విడుదల కాగానే మలి విడత ఆందోళనలకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. ఈ దఫా జరగనున్న ఆందోళనలను సాక్షాత్తు ముఖ్య మంత్రి ఆనంది బెన్ పటేల్ కూడా అడ్డుకోలేరని ఆయ న వ్యాఖ్యానించారు. ఈ దఫా జరగనున్న ఉద్యమాన్ని తమ సామాజిక వర్గానికే చెందిన వ్యక్తి అయినప్పటికీ సీఎం ఆనంది బెన్ పటేల్ కూడా అడ్డుకోలేరని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.