నగరి ఎమ్మెల్యే, వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా ఫ్యాన్స్ లో ఇప్పుడు ఒకటే ఆందోళన పట్టిపీడిస్తోంది. రోజా అంత పనిచేస్తుందా అని ఆమె అభిమానులు కలవరపడుతున్నారట.. రోజాను ఇక చూడలేమా అన్న ఆందోళన వారిలో నెలకొందట.. ప్రస్తుతం ఏపీఐఐసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టడంతో రోజా తనకు ఎంతో ఇష్టమైన జబర్ధస్త్ షోను వదిలేస్తున్నారన్న ప్రచారం అందరినీ షాక్ కు గురిచేస్తోంది..
తెలుగు రాష్ట్రాల్లో రోజా ఫేమస్ అయ్యింది జబర్ధస్త్ వల్లే. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్నా జబర్దస్త్ జడ్జిగా రోజాకు జనాలు బాగా కనెక్ట్ అయిపోయారు. షో ప్రారంభమైనప్పటి నుంచి నాగబాబు, రోజాలను జబర్ధస్త్ జడ్జిలుగా జనం ఫిక్స్ అయిపోయారు. బయట ఎంత ఫైర్ బ్రాండ్ అయినా రోజా నవ్వులు లేని జబర్ధస్త్ ను జనాలు ఊహించుకోవడం లేదు. సినిమాల తర్వాత రోజాను ప్రజలకు బాగా దగ్గర చేసింది జబర్ధస్త్ షోనే..
అయితే మొన్నటి ఎన్నికల్లో రెండోసారి నగరి నుంచి గెలిచిన రోజాకు మంత్రి పదవి ఖాయం అనుకున్నారంతా కానీ.. సామాజిక సమీకరణాలతో రోజాకు మంత్రిపదవిని జగన్ ఇవ్వలేకపోయారు. కానీ కేబినెట్ హోదా గల ఏపీఐఐసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఏపీ పరిశ్రమలు, మౌళిక సదుపాయల సంస్థ బాధ్యతలు చాలా పెద్దవి. ఏపీ అభివృద్ధికి ఈ సంస్థ ద్వారా మౌళిక సదుపాయాలు కల్పించడం రోజాకు కత్తిమీద సామే. మరి అలాంటి కీలకమైన పదవిలో ఉండి రోజా జబర్ధస్త్ కు కాల్షీట్లను ఎలా సర్దుబాటు చేస్తారన్నది ఆసక్తిగా మారింది.
ఈ క్రమంలోనే జబర్ధస్త్ కు కాల్షీట్లు ఇవ్వడం రోజాకు కుదరేపని కాదన్న ప్రచారం జరుగుతోంది. అందుకే రోజా జబర్ధస్త్ ను వీడడం ఖాయమన్న విశ్లేషణలు సాగుతున్నాయి. రోజా గనుక వైదొలిగితే అంతటి వ్యక్తిని ఎవరిని తీసుకురావలన్నది జబర్ధస్త్ నిర్వాహకులకు పెద్ద సమస్యగా మారిందట.. రోజా లేని లోటును పూడ్చే వ్యక్తిని వెతకడం అంతా ఈజీ కావడం లేదట.. రోజా లేని జబర్ధస్త్ ను చూడలేమని ఆమె అభిమానులు ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో తమ ఆవేదనను వ్యక్తం చేస్తుండడం విశేషం.