అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ఈసారి కళ తప్పనుంది. నిర్వాహకులకు పెద్ద షాకిస్తూ హాలీవుడ్ నల్ల జాతి నటులందరూ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. విల్ స్మిత్ లాంటి ప్రఖ్యాత నటుడు సైతం ఆస్కార్ అవార్డు కార్యక్రమానికి హాజరు కావట్లేదు. ఆస్కార్ అవార్డుల ఎంపికలో జాతి వివక్ష కొనసాగుతోందని.. గత కొన్నేళ్లుగా కేవలం తెల్ల జాతి నటులకు మాత్రమే ఆస్కార్ అవార్డులిస్తున్నారని నల్ల జాతి నటులు ఆరోపిస్తున్నారు. ఈసారి ఒక్క నల్ల జాతీయుడికి కూడా అవార్డు రాక పోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నల్లజాతి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకలను బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. విల్ స్మిత్ లాంటి ఫేమస్ ఆర్టిస్టు కూడా వివక్ష గురించి నిరసన గళం వినిపిస్తుండటంతో వ్యవహారం ముదురుతోంది. ఈసారి ఆస్కార్ అవార్డు వేడుకలు ఫిబ్రవరి 13న జరగనున్నాయి. భారత సంతతికి చెందిన నటుడు, నిర్మాత రాహుల్ థక్కర్ టెక్నీషియన్స్ కేటగిరీలో ఆస్కార్ అందుకోబోతుండటం విశేషం. ఐతే నల్లజాతి నటీనటుల నిరసన నేపథ్యంలో ఈసారి కార్యక్రమం ఎలా సాగుతుందో చూడాలి.