రాహుల్ గాంధీ చేస్తున్న 'భారత్ జోడో' పాదయాత్రలో సోనియాగాంధీ పాల్గొంటారా ? పాదయాత్ర ప్రస్తుతం కర్నాటకలో జరుగుతోంది. దసరా పండుగ సందర్భంగా రెండు రోజులు యాత్రకు విరామం ఇవ్వబోతున్నారు. తిరిగి బుధవారం మళ్ళీ ప్రారంభమవుతుంది. 6వ తేదీకి పాదయాత్ర మైసూరు ప్రాంతానికి చేరుకుంటుంది. సోనియాగాంధి, సోదరి ప్రియాంక గాంధీ అప్పటికి మైసూరుకు చేరుకుంటారని పార్టీ వర్గాలు చెప్పాయి. అంటే మైసూరులో జరిగే పాదయాత్రలో రాహూల్, సోనియా, ప్రియాంక ముగ్గురూ పాల్గొంటారన్నమాట.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇది ఒక అపూర్వ ఘట్టం గానే హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు. కాకపోతే తల్లీ, కూతుళ్ళిద్దరూ పాదయాత్రలో ఎంతసేపు పాల్గొంటారు, మైసూరు ప్రాంతంలోనే ఎన్నిరోజులుంటారనే విషయం మాత్రం తెలీదు. ఇద్దరూ ఒకేసారి మైసూరుకు వస్తున్నారంటే ఏదో ఇంపార్టెంటు విషయంలో చర్చించటానికి కూడా అయ్యుంటుందనే అనుకుంటున్నారు. బహుశా రాజస్థాన్ సీఎం మార్పు, ఎంపిక విషయంపైనే అయ్యుంటుందని నేతలంటున్నారు.
నిజానికి ఈ విషయం మాట్లాడేందుకు డైరెక్టుగా రావాల్సిన అవసరమే లేదు. ప్రతిరోజు మాట్లాడుకుంటున్నట్లుగానే ఈ విషయాన్ని కూడా ఫోన్లో మాట్లాడేసుకోవచ్చు. అయితే పాదయాత్ర మొదలైన దగ్గర నుండి ఇప్పటివరకు రాహుల్ ను సోనియా, ప్రియాంక కలిసిందిలేదు. పైగా కర్నాటక కాంగ్రెస్ నేతలు ఎప్పటినుండో తమ రాష్ట్రానికి రావాల్సిందిగా కోరుతున్నారట. సో అన్నీ కలిసివస్తుందని అనుకున్నట్లున్నారు. అందుకనే మైసూరు యాత్ర సందర్భంగా రాహుల్ తో పాదాలు కలపాలని సోనియా, ప్రియాంకలు వస్తున్నట్లు సమాచారం.
అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే చాలాకాలంగా సోనియా ఆరోగ్యం ఏమీ బావోలేదు. క్యాన్సర్ కు చికిత్స చేయించుకుంటున్నారు. అలాగే రెండుసార్లు కరోనా వైరస్ ఎటాక్ అయ్యింది. ఈ కారణాలతో కొద్దిరోజులు ఆసుపత్రిలో కూడా చేరారు.
అనారోగ్యం కారణాలతోనే సోనియా బహిరంగ సభల్లో పాల్గొనటం లేదు. ముఖ్యమైన నేతలు, సమావేశాల్లో తప్ప ఇంకెక్కడా కనబడటంలేదు. అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవటానికి అనారోగ్యమే ప్రధాన కారణం. మరిలాంటి నేపధ్యంలో జనాల మధ్యకు రావటమే కాకుండా పాదయాత్రలో కూడా పాల్గొంటారంటే పెద్ద విషయమే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.