ఏపీలో ప్రస్తుతం ఓ వైపు మున్సిపల్ ఎన్నికల వేడి మరోవైపు విశాఖ ఉక్కు వేడి కాకరేపుతోంది. మున్సిపల్ ఎన్నికలని కాసేపు పక్కన పెడితే .. నిన్న పార్లమెంట్ లో మాట్లాడిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ను వంద శాతం ప్రైవేట్ పరం చేయడం తథ్యం , కేంద్రం ఈ దిశగా ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకుంది. మళ్లీ దీనిపై చర్చ అనవసరం అన్నట్టుగా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ పై స్పష్టంగా తేల్చి చెప్పారు. నిర్మలమ్మ మాటలు విన్న ఏపీ వాసులు ఆగ్రహం తో ఊగిపోతున్నారు. నిన్నటి నుండి ఏపీ మొత్తం ఆందోళనలతో అట్టుడికిపోతోంది. ముఖ్యంగా విశాఖ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
ఈ నేపథ్యంలో ఏపీలో అధికారంలో వైసీపీ నేతలు రాజీనామా చేసి , కేంద్రం పై ఒత్తిడి పెంచాలనే వాదనలు ఎక్కువ అవుతున్నాయి. వైసీపీ ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తే కేంద్రం వనెక్కి తగ్గే అవకాశం ఉందంటూ కొందరు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేస్తే వారిని తిరిగి గెలిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ అంశాలపై ఏపీ పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తే ఏం వస్తుంది , రాజీనామా అస్త్రం శుద్ధ దండగ , రాజీనామా చేస్తే ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ పరం కాకుండా ఆగుతుందా అని ప్రశ్నించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అందరం ఏకతాటిపైకి వచ్చి, పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ అంశంపై సీఎం జగన్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారని..తెదేపా సహా అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లను దిల్లీకి తీసుకెళ్తామని చెప్పారని, ఇదే సమయంలో గత ప్రభుత్వం హయాంలో చంద్రబాబు హయాంలో ఏ సమస్యపైన అయినా ఒక్కసారైనా అఖిలపక్షం పెట్టారా అని గట్టిగా ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓడిన చంద్రబాబు ఉక్రోషంతో మాట్లాడుతున్నారని, మున్సిపల్ ఎన్నికల్లోనూ 90శాతం విజయం వైకాపాదేనని స్పష్టం చేశారు. మళ్లీ ఎన్నికలు వస్తే వైకాపాకు 170 స్థానాలను కైవసం చేసుకుంటుందనే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు పెట్టుకోవాలని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కాబట్టి ఇంకా టీడీపీ లో ఆ కొంతమంది ఎమ్మెల్యేలు అయినా ఉన్నారని , నేను కనుక ముఖ్యమంత్రి నైతే టీడీపీలో చంద్రబాబు ఒక్కరే పార్టీలో మిగిలేవారు అంటూ ఎద్దేవా చేశారు.