హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ ఓటమి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవికి ముప్పు తేనుందా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన రెండు రాష్ట్రాల ఎన్నికల్లో గుజరాత్‌లో అధికారాన్ని నిలబెట్టుకున్న బీజేపీ హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయింది.
మొత్తం 68 స్థానాలు ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఏకంగా 40 స్థానాలు దక్కించుకోగా బీజేపీ 25 సీట్లకే పరిమితమైంది. స్వతంత్రులు మరో మూడు స్థానాల్లో గెలుపొందారు. ఈ ముగ్గురూ బీజేపీ రెబల్సే కావడం గమనార్హం.
హిమాచల్ ప్రదేశ్... బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సొంత రాష్ట్రం. జేపీ నడ్డా అనుసరించిన విధానాలతోనే బీజేపీ అక్కడ ఓటమి పాలయిందని నిఘా వర్గాలు ప్రధాని నరేంద్ర మోడీకి నివేదిక సమర్పించినట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా నడ్డా తన ప్రత్యర్థి మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్‌ను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టారని సమాచారం. అంతేకాకుండా ప్రేమ్ కుమార్ ధుమాల్ కుమారుడైన ప్రస్తుత కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో విభేదాలు కొనసాగించారని నిఘా వర్గాలు మోడీకి నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది.
హిమాచల్ కు చెందిన నడ్డా పార్టీ జాతీయ అధ్యక్షుడైనప్పటికీ ఆ రాష్ట్రంలో ముఠా నాయకుడుగా వ్యవహరించారని నిఘా వర్గాలు ప్రధాని మోడీకి నివేదిక ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మాజీ సీఎం ప్రేమ్ కుమార్ ధుమాల్ వర్గాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టినందునే పెద్ద ఎత్తున తిరుగుబాట్లు జరిగాయని నివేదించినట్టు తెలిసింది. నడ్డా, ప్రేమ్ కుమార్ ధుమాల్ వర్గాలు ఒకరినొకరు ఓడించుకునే క్రమంలో ఇరు వర్గాలకూ నష్టం జరిగిందని సమాచారం. జేపీ నడ్డా సొంత ప్రాంతం బిలాస్ పూర్ లో చావు తప్పి కన్నులొట్టబోయినట్లు బీజేపీ మూడు సీట్లలో మాత్రమే అది కూడా స్వల్ప మెజారిటీతో బయటపడింది.
ఇక మాజీ సీఎం ప్రేమ్ కుమార్ ధుమాల్ కుమారుడు, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హమీర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో మొత్తం 17 అసెంబ్లీ సీట్లు ఉండగా బీజేపీ 13 చోట్ల చావుదెబ్బతింది. కేవలం నాలుగు చోట్ల మాత్రమే విజయం సాధించగలిగింది. జేపీ నడ్డా, కేంద్ర మంత్రి ఠాకూర్, సీఎం జైరాం ఠాకూర్ వర్గాలు తమ స్వప్రయోజనాల కోసం పనిచేయడం పార్టీకి నష్టం చేకూర్చిందని మోడీ, అమిత్ షా అంచనాకు వచ్చినట్టు చెబుతున్నారు.
సొంత పార్టీలో తన ప్రత్యర్థులను అణచివేయడానికి వారి వర్గాలకు చెందిన నేతలకు నడ్డా టికెట్లు దక్కకుండా అడ్డుకున్నారని అంటున్నారు. దీంతో 21 మంది బీజేపీ నేతలు రెబల్స్ గా పోటీ చేశారని గుర్తు చేస్తున్నారు. ఈ 21 మంది బీజేపీ అభ్యర్థుల ఓట్లను భారీగా చీల్చి కాంగ్రెస్ కు లబ్ధి చేకూర్చారని చెబుతున్నారు. గెలిచిన ముగ్గురు ఇండిపెండెంట్లు బీజేపీ రెబల్స్ కావడం ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో పార్టీ పరాజయానికి కారణమైన జేపీ నడ్డాను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా తప్పించే యోచనలో ప్రధాని మోడీ ఉన్నట్టు చెబుతున్నారు. వాస్తవానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 20తో ముగుస్తుంది. ఆ తర్వాత కూడా జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడిగించి 2024 లోక్‌సభ ఎన్నికల వరకు జేపీ నడ్డానే కొనసాగించాలని ముందుగా అనుకున్నారు.
అయితే స్వీయ తప్పిదాలు, తన అహం, సొంత పార్టీలో ప్రత్యర్థులను దెబ్బతీసే లక్ష్యంతో హిమాచల్ ప్రదేశ్ లో జేపీ నడ్డా బీజేపీ కొంప ముంచారని ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జేపీ నడ్డాను తొలగించడం ఖాయమని బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.